రంగనాయకమ్మ మీద 13 ఎఫ్ఐఆర్‌లు..

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ మీద రంగనాయమ్మకు సీఐడీ నోటీసులు ఇచ్చిన ఘటన ఏపీలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

news18-telugu
Updated: June 6, 2020, 7:27 PM IST
రంగనాయకమ్మ మీద 13 ఎఫ్ఐఆర్‌లు..
రంగనాయకమ్మకు ఏపీ సీఐడీ నోటీసులు (File)
  • Share this:
ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి ఫేస్ బుక్ పేజీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు సీఐడీ నుంచి నోటీసులు అందుకుని, విచారణకు హాజరైన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ మీద గతంలో 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మహిళ మీద పోలీసులు కేసు నమోదు చేస్తే.. ఇది రాజకీయ కుట్ర అని చంద్రబాబు రాద్ధాంతం చేశారు. ఆ రంగనాయకమ్మ చాలా అమాయకురాలు. ఆమె మీద గతంలో కేవలం 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



ప్రజలని రెచ్చగొట్టే విదంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ గుంటూరుకు చెందిన 66 ఏళ్ల రంగనాయకమ్మ పై ఇప్పటికే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడి పై (ఆయన ఫేస్ బుక్ పేజీ నుంచి రంగనాయకమ్మ షేర్ చేశారు.) సీఐడీ దృష్టి పెట్టింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని రంగనాయకమ్మను విచారించిన సందర్భంగా సీఐడీ ఎస్పీ సరిత అన్నారు. ఏ వయసు వారు తప్పుచేసినా శిక్ష తప్పదని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు. ప్రజలను అయోమయానికి గురిచేసేలా ఎవరు ప్రచారం చేసినా శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ళ జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుందని, రెండోసారి కూడా తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని తెలిపారు.

రంగనాయకమ్మ మీద గతంలో 13 కేసులు
Published by: Ashok Kumar Bonepalli
First published: June 6, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading