మళ్లీ జన్మంటు ఉంటే గుర్రంగా పుడదామనుకున్న ప్రణబ్ ముఖర్జీ...ఎందుకంటే..

ప్రణబ్ జీవితంలో చాలా అంశాలు 13 సంఖ్యతో సంబంధం కలిగి ఉన్నాయి. 1969 లో ప్రణబ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన అధికారిక నివాసము రాష్ట్రపతి భవన్‌కు దగ్గర్లోనే ఉండేది. దీంతో ప్రతిరోజు ఆయన రాష్ట్రపతి భవన్‌ని చూస్తూ ఉండేవారు.

news18-telugu
Updated: January 26, 2019, 2:00 PM IST
మళ్లీ జన్మంటు ఉంటే గుర్రంగా పుడదామనుకున్న ప్రణబ్ ముఖర్జీ...ఎందుకంటే..
రాష్ట్రపతిగా గుర్రపు బగ్గీలో ప్రణబ్ ముఖర్జీ
  • Share this:
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డును ప్రకటించింది. అయితే... ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. యూపీఏ హయాంలో అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా పనిచేసిన ప్రణబ్ ఆ తర్వాత దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా కూడా సేవలు అందించారు. ప్రణబ్ ఎలాంటి నాయకుడంటూ... కేవలం ఆయన పార్టీ నేతలే కాదు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆయన్ని ఎంతో అభిమానించేవారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ముడిపడి ఉన్న ఎన్నో ఆసక్తికరమైన అంశాల్ని ప్రజలు కథలుగా చెప్పుకుంటారు.

13 నెంబర్‌తో ప్రణబ్‌కు ప్రత్యేక అనుబంధం:  సాధారణంగా 13 నెంబర్ అంటేనే చాలామంది భయపడుతుంటారు. అమెరికా వైట్ హౌస్‌లో అయితే ఆ నెంబర్ గల రూంను దేనికోసం కూడా ఉపయోగించారు. దీన్ని చాలా మంది అశుభంగా ఫీల్ అవుతుంటారు. కానీ ప్రణబ్ జీవితంలో చాలా అంశాలు 13 సంఖ్యతో సంబంధం కలిగి ఉన్నాయి. రాష్ట్రపతిగా ప్రణబ్ రంగంలోకి దిగింది 13వ తేదీనే. ఢిల్లీలో ఆయన ఉండే బంగ్లా నెంబర్ కూడా 13. ఆయన వివాహ వార్షికోత్సవం కూడా 13వ తేదీలోనే వస్తుంది. అంతేకాదు ములాయం సింగ్‌ను రాష్ట్రపతిని చేయాలనుకున్న మమతా బెనర్జి తొలిసారిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలిపి ప్రణబ్ పేరును ఎత్తిచాటింది కూడా జూన్ 13, 2012.

ఈ జన్మలోనే నీకల నెరవేరుతుందన్న ప్రణబ్ సోదరి:  1969 లో ప్రణబ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆయన అధికారిక నివాసము రాష్ట్రపతి భవన్‌కు దగ్గర్లోనే ఉండేది. దీంతో ప్రతిరోజు ఆయన రాష్ట్రపతి భవన్‌ని చూస్తూ ఉండేవారు. ఒకరోజు రాష్ట్రపతి భవన్‌లోని గుర్రపు బగ్గీని చూసిన ఆయన... సోదరి అన్నపూర్ణతో వచ్చే జన్మంటు ఉంటే గుర్రపు బగ్గీలో గుర్రాన్ని అవుతానన్నారు. ఆమాటలు విన్న సోదరి వచ్చే జన్మవరకు ఎందుకు... ఈజన్మలోనే నువ్వు రాష్ట్రపతి భవన్‌లో ఉండే అవకాశం వస్తుందని ప్రణబ్‌తో అన్నారు. దీని గురించి వచ్చే జన్మవరకు వేచి ఉండాల్సిన పని లేదన్నారు అన్నపూర్ణ. ఆమె ఆనాడు అన్న వ్యాఖ్యలు అక్షరాలా నిజమయ్యాయి.

చిన్నతనం నుంచి మొండి వైఖరి:  ప్రణబ్ ముఖర్జీ కొన్ని అంశాల్లో చాలా మొండిగా, పట్టుదలగా ఉంటారు. అయితే ఆ మొండితనం ఆయనకు చిన్నప్పటి నుంచి ఉంది. చదువు పట్ల ఆయనకున్న పట్టుదలతో ప్రాథమిక విద్యలోనే డబుల్ ప్రమోషన్ సాధించారు. అయితే ప్రణబ్‌ను తల్లిదండ్రులు మిరాటి అనేగ్రామంలో పై చదువుల కోసం వెళ్లాలని చెప్పారు. ప్రణబ్‌కుమాత్రం కిర్ణహార్ అనే గ్రామంలోని పాఠశాలలో చదవులుకోవాలని ఉండేది.దీంతో ఆయన పట్టుదలతో అక్కడ పాఠశాలలో ప్రవేశం కోసం పరీక్షలు రాసి పాస్ అయ్యారు. కిర్ణహార్ స్కూళ్లో డైరెక్ట్‌గా ఐదో తరగతిలో జాయిన్ అయ్యారు.

ఆ జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్రపతులు:  ప్రణబ్ రాష్ట్రపతిగా అప్పట్లో ఎన్నిక కావడంతో వీర్‌భూమ్ పేరు మారు మోగిపోయింది. అయితే ఈ వీర్ భూమ్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అధిరోహించారు. అందులో ఒకరు ప్రణబ్ ముఖర్జీ కాగా మరొకరు అబ్దుల్ సత్తార్ (దకర్ గ్రామానికి చెందిన)1981-82 వరకు బంగ్లాదేశ్ రాష్ట్రపతిగా పనిచేశారు. దేశ విభజన జరిగిన తర్వాత ఆయన ఢాకా వెళ్లిపోయారు. అంతేకాదు రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటూ కూడా ఓటేసిన ప్రముఖుల్లో ప్రణబ్ ముఖర్జీ మూడో వ్యక్తి ఆయనకన్నా ముందు డాక్టర్ ఫక్రూద్దీన్ అలీ అహ్మద్, జ్ఞాని జైల్ సింహ్ కూడా గతంలో ఇలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటూ ఓటు వేశారు.
First published: January 26, 2019, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading