• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • 5 STATE ELECTIONS TAMIL NADU PRESSURE COOKERS SEIZED IN TAMILNADU NGS

Tamilandu Elections: తమిళనాడులో పోలీసులకు షాక్ ఇచ్చిన ప్రెజర్ కుక్కర్లు.. జయలలిత పేరుతో ప్రచారం

Tamilandu Elections: తమిళనాడులో పోలీసులకు షాక్ ఇచ్చిన ప్రెజర్ కుక్కర్లు.. జయలలిత పేరుతో ప్రచారం

తమిళనాడులో ప్రెజర్ కుక్కర్లు కలకలం రేపాయి. అది పదుల సంక్యలో కాదు.. 3వేలకు పైగా ప్రెజర్ కుక్కర్లను లారీల్లో చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఈ కుక్కర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎక్కడికి వెళ్తున్నాయి?

తమిళనాడులో ప్రెజర్ కుక్కర్లు కలకలం రేపాయి. అది పదుల సంక్యలో కాదు.. 3వేలకు పైగా ప్రెజర్ కుక్కర్లను లారీల్లో చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఈ కుక్కర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎక్కడికి వెళ్తున్నాయి?

  • Share this:
    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆల్ ఫ్రీ ఇది ఎప్పుడు వింటున్న మాటే. అంతేకాదు ప్రలోభాలు కూడా భారీగా ఉంటాయి. గతంతో పోల్చుకుంటే ఈ సారి ఓటర్లను భారీగా ప్రలోభాలకు గురిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలకు తోడు చిన్నమ్మ శశికళ కూడా పోటీకి సై అనడంతో ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడంమే కష్టం.

    తమిళనాడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే పోలీసులకు షాక్ లు తప్పడం లేదు. అప్పుడే ఓటర్లకు ప్రలోభాల పర్వం ప్రారంభమైంది. ఎంతలా అంటే.. కోడ్ అమల్లోకి వచ్చిన రెండో రోజే భారీగా ప్రజర్ కుక్కర్లు పంచిపెట్టారు. అది పదులు.. వందల సంఖ్యలో కాదు.. ఆ సంఖ్య వేలల్లో ఉంటే.. వినడానికి షాక్ అనిపిస్తోంది కదా..? కానీ నిజం. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది..  ఈ ఎన్నికల్లో టిటీడీ దినకరన్ కు కేటాయించింది కూడా కుక్కరు గుర్తే.

    తమిళనాడులోని అరియలూరు జిల్లాలో రెండు లారీల్లో భారీగా ప్రెజర్‌ కుక్కర్లు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వరణాసి సమీపంలోని సమతువపురం దగ్గర వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆపారు. అయితే ఆ లారీ డ్రైవర్ మాత్రం ఖాళీ డబ్బాలు తీసుకెళ్తున్నామని చెప్పడంతో వారిని వదిలేశారు. తరువాత రెండో లారీ కూడా వచ్చింది. వరుసగా రెండు లారీలు ఖాళీ డబ్బాలతో వెళ్లడం ఏంటని పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తనిఖీ చేయగా 1,500 ప్రెజర్‌ కుక్కర్లు కనిపించాయి. వెంటనే మొదట లారీని కూడా ఆపేసి చూడగా అందులో 1,700 కుక్కర్లు ఉన్నాయి. మొత్తం 3,300 కుక్కర్ల విలువ సుమారు 12 లక్షల రూపాయల పైనే ఉంటుందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఆ కుక్కర్లపై ఉన్న స్టిక్కర్లను చూసి పోలీసులే నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. వాటిపై ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఫోటోలు పెట్టారు. ఆ వెనుక శశికళ, ఏఎఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌, ఆ పార్టీ నాయకుడు వేలు కార్తికేయన్‌ ఫొటోలను ముద్రించారు. ఆ కుక్కర్లను ఎన్నికల నేపథ్యంలో తంజావూరుకు తీసుకెళ్తున్నారని పోలీసులు గుర్తించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే దినకరన్‌ పార్టీ ఏఎఎంకే గుర్తు ప్రెజర్‌ కుక్కరే కావడం గమనార్హం. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నారని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు