Home /News /politics /

5 STATE ELECTIONS RESULTS TODAY WHERE TO WATCH RESULTS OF WEST BENGAL ASSAM TAMIL NADU KERALA PUDUCHERRY POLLS SK

5 State elections Results: నేడే రిజల్ట్స్.. కచ్చితమైన ఎన్నికల ఫలితాల కోసం ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమ బెంగాల్‌పైనే అందరి దృష్టి ఉంది. బెంగాల్‌లో మమతాను ఓడించేందుకు బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డింది. మెజారిటీ సర్వేలు టీఎంసీకి అనుకూలంగా ఉండగా.. మరికొన్ని బీజేపీ గెలుస్తాయని చెప్పాయి.

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు వేళయింది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలతో పాటు ఉపఎన్నికలు జరిగిన చోట ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమయింది. నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ ప్రారంభించిన కాసేపటి తర్వాత ట్రెండ్స్ తెలిసిపోతాయి. 10 గంటల కల్లా ఒక క్లారిటీ వస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడవుతాయి.

    అన్ని వార్తా సంస్థలు తమ టీవీ ఛానెళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాల్లో ఫలితాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తాయి. ఐతే కచ్చితమైన ఎన్నికల ఫలితాల కోసం న్యూస్ 18ను వీక్షించండి. ఇందుకోసం న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్‌ని సందర్శించండి. లేదంటే న్యూస్ 18 యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఎన్నికల అప్‌డేట్స్, ఇతర ముఖ్యాంశాలను చూడవచ్చు. నెట్‌వర్క్ 18లోని అన్ని టీవీ ఛానెళ్లతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని వెబ్‌సైట్లలోనూ ఫలితాలను తెలుసుకోవచ్చు.

    ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫలితాల కోసం యూజర్లు లాగిన్ కావాల్సి ఉంటుంది. మల్టీ-డైమన్షనల్ అనాలసిస్ కూడా ఉంటుంది. భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://results.eci.gov.in/ని ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై జనరల్ అసెంబ్లీ ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికలు, లోక్‌సభ ఉపఎన్నికలు వంటి ఆపన్స్ ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్స్‌ను ఎంచుకొని దానికి సంబంధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు వీక్షించవచ్చు.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడు, 140 సీట్లున్న కేరళ అసెంబ్లీతో పాటు పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించారు. తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేశాయి. ఐతే పశ్చిమ బెంగాల్‌పైనే అందరి దృష్టి ఉంది. బెంగాల్‌లో మమతాను ఓడించేందుకు బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డింది. మెజారిటీ సర్వేలు టీఎంసీకి అనుకూలంగా ఉండగా.. మరికొన్ని బీజేపీ గెలుస్తాయని చెప్పాయి.

    తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఉపఎన్నికలు జరిగాయి. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి, తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ ఫలితాలు కూడా ఆదివారం రానున్నాయి. ఐతే తిరుపతిలో వైసీపీ, సాగర్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి ఐదు రాష్ట్రాలతో ఎవరెవరు అధికారం చేపడతారు? ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్నది.. కొన్ని గంటల్లోనే తేలనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: 5 State Elections, Assam Assembly Elections 2021, Kerala Assembly Elections 2021, Puducherry Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections 2021, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు