Assembly Election 2022 LIVE Results: పార్టీ గెలిచినా.. సీఎం ఓటమి.. ఉత్తరాఖండ్‌లో విచిత్ర పరిస్థితి

5 State Assembly Elections Results Live Updates: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand),మణిపూర్ (Manipur), గోవా(Goa)లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. పంజాబ్ (Punjab)లో ఆమాద్మీ సర్కార్ కొలువుదీరనుంది.

 • News18 Telugu
 • | March 10, 2022, 17:16 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED 4 MONTHS AGO

  AUTO-REFRESH

  Highlights

  17:12 (IST)

  లఖింపూర్ ఖేరీలో బీజేపీ క్లీన్ స్వీప్:

  గతేడాది అక్టోబర్ 3న లఖింపూర్‌లో హింసాకాండ చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కుమారుడు కారుతో ఢీకొట్టిన ఘటనలో పలువురు రైతులు మరణించారు. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.కానీ అవేమీ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. జిల్లాలోని మొత్తం 8 సీట్లలో బీజేపీయే గెలిచింది.

  16:40 (IST)

  యూపీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతోంది బీజేపీ. సీఎంగా యోగి రెండో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు.  ఐతే 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎన్డీ తివారి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ వరుసగా రెండోసారి సీఎంగా పనిచేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు యోగి ఆ ఘనత సాధించారు.

  16:19 (IST)

  మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ (బీజేపీ) హింగాంగ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రత్యర్థి పంగేజం శరత్‌చంద్ర సింగ్‌పై 17,000 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.

  16:0 (IST)

  ఉత్తరాఖండ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. వరుసగా రెండో సారి బీజేపీ గెలిచింది. మ్యాజిక్ మార్క్‌ని దాటి దూసుకెళ్తోంది. కానీ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాత్రం ఓడిపోయారు. ఖతిమా స్థానంలో 6వేల ఓట్లతో  పరాజయం పాలయ్యారు. విపక్ష నేత హరీష్ రావత్ కూడా లాల్కువా నుంచి ఓటమిపాలయ్యారు. ఆయన కూతురు అనుపమ రావత్ హరిద్వార్‌లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌కు సీఎంగా కొత్త నేత  రాబోతున్నారు.

  15:57 (IST)

   ప్రజల తీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు. కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్‌ల కృషి,  అంకితభావానికి నా ధన్యవాదాలు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటాం.

  - రాహుల్ గాంధీ

  15:47 (IST)

  సీఎంను ఓడించిన స్వీపర్ కుమారుడు

  పంజాబ్‌లోని భదౌర్ నియోజకవర్గంలో సీఎం ఛన్నీని లభ్ సింగ్ యుగోకే ఓడించాడు. అతడు ఒక చిన్న మొబైల్ రిపేర్ షాపులో పనిచేస్తాడు. లభ్ సింగ్ తల్లి ప్రభుత్వ స్కూల్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. అతడి తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి చీపురును పట్టుకొని స్కూల్లో చెత్తను ఊడ్చితే.. ఆమె కుమారుడు ఆమాద్మీ చీపురు పట్టుకొని.. రాజకీయాలను ఊడ్చేశాడు. ఏకంగా సీఎంనే ఓడించాడు.

  15:34 (IST)

  మన దేశం నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్లి వైద్య విద్య చదువుతున్నారు. 75 ఏళ్లైనా మన వద్ద సరైన విద్యా వ్యవస్థ లేదు. మనోళ్లు ఉక్రెయిన్ వెళ్లి కాదు.. విదేశాల నుంచే మన దేశానికి రావాలి. అలాంటి భారత దేశం కావాలి. ఇప్పటికే 75 ఏళ్లు వృథా చేశాం. ఇక వృథా చేయకూడదు. మార్పు కోసం పోరాడాలి.

  -కేజ్రీవాల్
   

  15:31 (IST)
  బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తర్వాత వ్యవస్థ మారకపోతే.. మనదేశంలో ఏమీ జరగదని గతంలో భగత్‌ సింగ్ ఒక సందర్భంలో చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు గత 75 ఏళ్లల్లో పార్టీ, నేతలు అదే బ్రిటిష్ వ్యవస్థను అమలు చేశారు. దేశాన్ని దోచుకుంటున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు కట్టించలేదు. అందుకే వ్యవస్థను మార్చే పనిలో ఆమాద్మీ పార్టీ ఉంది.
  - అరవింద్ కేజ్రీవాల్
   
  15:29 (IST)

  ద్వేషంతో కాకుండా ప్రేమతో కూడిన రాజకీయాలు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఎలాంటి దూషణలకైనా దూషించే మాటలతో స్పందించాల్సిన అవసరం లేదు. ప్రేమతో ఇవ్వాలి. భారత్ నంబర్ 1 దేశంగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.

  - అరవింద్ కేజ్రీవాల్

  5 State Assembly Elections Results Live Updates: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.  ఐదు రాష్ట్రాల్లో నాలుగింట  ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh),  ఉత్తరాఖండ్ (Uttarakhand)లో స్పష్టమైన మెజారిటీ కనబరించింది. గోవా (Goa)లో మ్యాజిక్ నెంబర్ 21కి ఒక్క సీటు దూరంలో ఆగిపోయింది. 20 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఐతే ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. మణిపూర్‌((Manipur Assembly Election 2022 result) )లోనూ అతి పెద్ద పార్టీగా అవతరించనుంది. ఇతర పార్టీల మద్దతులతో అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలుపుకోనుంది కమలం పార్టీ.

  యూపీలో బీజేపీ ఘన విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రైతులు ఆందోళనలు ఎక్కువగా జరిగిన పశ్చిమ యూపీలో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. రైతుల ఆందోళనలు ఎన్నికల్లో ప్రభావం చూపవని హోంమంత్రి అమిత్ షా ఇది వరకే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు బీజేపీకే వచ్చాయి. బీజేపీకీ ఈసారి సీట్లు తగ్గినా.. గతం కంటే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు.  సీఎంగా యోగి రెండో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఐతే 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న సీఎంగా చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎన్డీ తివారి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఎవరూ వరుసగా రెండోసారి సీఎంగా పనిచేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు యోగి ఆ ఘనత సాధించారు.

  పంజాబ్ (Punjab Assembly Election 2022 result)లో మాత్రం ఆప్ దుమ్మురేపింది. అకాలీదళ్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలను ఆమాద్మీ చీపురు ఊడ్చేసింది. అక్కడ వార్ వన్ సైడ్ అయింది. స్పష్టమైన మెజారిటీతో ఆప్ దూసుకెళ్లింది. సామాన్య ప్రజలే అక్కడ రాజకీయ ఉద్దండులను ఓడగొట్టారు. సీఎం ఛన్నీతో పాటు మాజీ సీఎంలను కూడా మట్టి కరిపించారు. భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.  తాను సీఎం అయ్యాక..తొలి సంతకం నిరుద్యోగ నిర్మూలపైనే చేస్తానని ఆయన ప్రకటించారు.

  ఉత్తరాఖండ్‌ (Uttarakhand Assembly Election 2022 result)లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. అలాంటి ఫలితాలు కనిపించడం లేదు. ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీతో  సాధించింది. ఐత సీఎం పుష్కర్ ధామి ఓడిపోవడం పార్టీ వర్గాలు జీర్ణించుకోవడం లేదు. విపక్ష నేత, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా ఓటమి పాలయ్యారు. మొత్తంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కమలం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.