ఏపీకి కొత్తగా ఐదుగురు ఐపీఎస్ అధికారులు

ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు.

news18-telugu
Updated: November 12, 2019, 9:30 AM IST
ఏపీకి కొత్తగా ఐదుగురు ఐపీఎస్ అధికారులు
డీజీపీతో కొత్త ఐపీఎస్ అధికారులు
  • Share this:
ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగింది.  నేషనల్ పోలీస్ అకాడమీలో 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఏపీకి కేటాయించారు. ఐపీఎస్ అధికారుల్లో పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి (రాజస్థాన్), కృష్ణకాంత్ పాటిల్ (తెలంగాణా), వి.ఎన్.మణికంఠ చందోలు (ఆంధ్రప్రదేశ్), కృష్ణకాంత్ (ఆంధ్రప్రదేశ్) లు ఉన్నారు. ఏపీకి కేటాయించబడిన ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ప్రత్యేక విభాగాలైన సీఐడీ, ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ, అక్టోపస్, సెక్యూరిటీ వింగ్ , విజిలెన్స్, ఏసీబీ, గ్రేహౌండ్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిందిగా డీజీపీ ట్రైనింగ్ ఐజీపీ సంజయ్ కు ఆదేశాలు జారీ చేశారు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com