ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు.
ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు జరిగింది. నేషనల్ పోలీస్ అకాడమీలో 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఏపీకి కేటాయించారు. ఐపీఎస్ అధికారుల్లో పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి (రాజస్థాన్), కృష్ణకాంత్ పాటిల్ (తెలంగాణా), వి.ఎన్.మణికంఠ చందోలు (ఆంధ్రప్రదేశ్), కృష్ణకాంత్ (ఆంధ్రప్రదేశ్) లు ఉన్నారు. ఏపీకి కేటాయించబడిన ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ప్రత్యేక విభాగాలైన సీఐడీ, ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ, అక్టోపస్, సెక్యూరిటీ వింగ్ , విజిలెన్స్, ఏసీబీ, గ్రేహౌండ్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిందిగా డీజీపీ ట్రైనింగ్ ఐజీపీ సంజయ్ కు ఆదేశాలు జారీ చేశారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.