సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐదురోజల పనిదినాలు పొడిగింపు

ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.

news18-telugu
Updated: June 26, 2019, 9:58 AM IST
సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఐదురోజల పనిదినాలు పొడిగింపు
ప్రభుత్వ ఉద్యోగులు (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 26, 2019, 9:58 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదురోజుల పనిదినాల్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అంగీకరించారు. ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఐదు రోజుల పనిదినాలను పొడిగించేందుకు సీఎం అంగీకరించడంపై ప్రభుత్వ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఉద్యోగులు కూడా సీఎం నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...