మంత్రి గారి 'కారు'కు దూకుడెక్కువ.. ఆ విషయంలో శ్రీనివాస్ గౌడ్ టాప్..

సామాన్యుల విషయంలో రెండు, మూడు చలాన్లు దాటగానే వాహనాన్ని సీజ్ చేసే అధికారులు.. ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

news18-telugu
Updated: May 6, 2019, 3:40 PM IST
మంత్రి గారి 'కారు'కు దూకుడెక్కువ.. ఆ విషయంలో శ్రీనివాస్ గౌడ్ టాప్..
మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీసీటీవిలో రికార్డయిన ఆయన కారు..
news18-telugu
Updated: May 6, 2019, 3:40 PM IST
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 'కారు'(TSO6EL6666) ఎవరికీ అందనంత స్పీడులో దూసుకెళ్తోంది. ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు చిక్కకుండా 'రయ్'మని పరుగులు తీస్తోంది. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 36 సార్లు స్పీడ్ లిమిట్‌ను అతిక్రమించింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ కింద 2016 నుంచి ఇప్పటివరకు ఆయన కారుపై రూ.46,300 మేర 40 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ 2016 అగస్టు నుంచి 2019 ఫిబ్రవరి వరకు విధించబడ్డ చలాన్లు. వీటికి సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా.. ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఇక శ్రీనివాస్ గౌడ్ సతీమణి శారద పేరిట రూ.16390 మేర 14 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఇందులో 13 చలాన్లు అతివేగం/ప్రమాదకర డ్రైవింగ్ కారణంగా విధించినవే. వీటిపై ఇచ్చిన నోటీసులకు కూడా ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. ఒక్క శ్రీనివాస్ గౌడ్ మాత్రమే కాదు.. పెండింగ్ చలాన్ల జాబితాలో మిగతా మంత్రులు కూడా ఎక్కువే ఉన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి పేరిట మూడు కార్లు ఉండగా.. వాటిపై రూ.23వేల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఇక పలువురు ఎమ్మెల్యేల పేరిట కూడా చాలానే పెండింగ్ చలాన్లు ఉన్నాయి. సామాన్యుల విషయంలో రెండు, మూడు చలాన్లు దాటగానే వాహనాన్ని సీజ్ చేసే అధికారులు.. ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...