చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు షాక్.. తీహార్ జైల్లోనే మాజీ ఆర్థికమంత్రి

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను ఆగస్టు 21న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. అక్టోబరు 3న జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది.

news18-telugu
Updated: September 30, 2019, 4:24 PM IST
చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు షాక్.. తీహార్ జైల్లోనే మాజీ ఆర్థికమంత్రి
చిదంబరం
news18-telugu
Updated: September 30, 2019, 4:24 PM IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. చిదరంబం బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చిదంబరం బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని.. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చిదంబరం ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సాధారణ బెయిల్ పిటిషన్‌తో పాటు తనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు చిదంబరం. దీనిపై విచారించిన హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్‌ సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఇదివరకే కోర్టుకు చెప్పారు. అన్ని ఆధారాలను ఆయన మాయం చేశారని.. ఇప్పుడుకు బెయిల్‌పై బయటకు వెళ్తే సాక్షులనూ ప్రభావితం చేస్తారని కోర్టుకు విన్నవించారు. కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను ఆగస్టు 21న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. అక్టోబరు 3న జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...