Home /News /politics /

32 RAILWAY PROJECTS COSTING RS 64429 WERE IN PROGRESS FOR AP RAILWAY MINSTER ANSWERED TO MP PARIMAL NATHWANI QUESTION GNT NGS

Andhra Pradesh:ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. 32 రైల్వే ప్రాజెక్టులు కేటాయింపు: ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత బడ్జెట్ తో పోలిస్తే ఈ సారి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. ఈ మూడేళ్ల కాలంలో ఏపీకి ఏఏ ప్రాజెక్టులు కేటాయించారని ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీ రైల్వే ప్రాజెక్టుల కోసం అత్యధికంగా 5,812 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్టు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడు పరిమల్ నథ్వానీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. 2020 ఏప్రిల్ 01నాటికి 64 వేల429 కోట్ల రూపాయల వ్యయంతో 32 రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదించామని.. అందులో 16 కొత్త లైన్లు ఉండగా.. 16 లైన్లను పొడిగించామని సమాధానం ఇచ్చారు. 5 వేల 704 కిలోమీటర్ల పొడవును పూర్తిగా రైల్వే లైన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కేటాయించిన రైల్వే ప్రాజెక్టులు కొన్ని పూర్తి అవ్వగా.. కొన్నిఅమలులో ఉన్నాయని వివరణ ఇచ్చారు.

    మార్చి 2020 వరకు 10,455 కోట్ల రూపాయల వ్యయంతో 336 కిలోమీటర్ల పొడవుతో రైల్వే ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, భద్రతా పనుల కోసం సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపుల కోసం భారీగా కేటాయింపులు చేశామన్నారు. 2014-19లో కేటించిన నిధులు కొన్ని ఇవ్వగా.. మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి అన్నారు. 2009-14లో సంవత్సరానికి 886 కోట్ల నిధుల నుంచి 2,830 కోట్లకు పెరిగిందని.. 2009-14 సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపు కంటే 219 శాతం కేటాయింపులు పెరిగాయి అన్నారు.

    2019-20లో బడ్జెట్ కేటాయింపులను 3 వేల 885 కోట్ల రూపాయలకు పెంచామన్నారు. అలాగే 2020-21లో దీనిని 4 వేల 910 కోట్ల రూపాయలకు పెంచామన్నారు. ఇప్పుడు తాజాగా 2021-22లో ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా 5వేల 812 కోట్లకు బడ్జెట్ వ్యయం ప్రతిపాదించబడిందని మంత్రి పేర్కొన్నారు.

    1 ఏప్రిల్, 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 32 రైల్వే ప్రాజెక్టుల కోసం 64 వేల 429 కోట్ల రూపాయల ప్రతిపాదించడం అయ్యిందని.. అందులో 16 కొత్త లైన్ కాగా 16 లైన్లను పొడిగించినట్టు చెప్పారు. అవి ప్రస్తుతం ఆ పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. వీటిలో 336 కిలోమీటర్ల పొడవు మార్చి 2020 నాటికి 10 వేల 455 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్టు చెప్పారు.

    మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు భద్రతా పనుల కోసం సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపుల మంత్రి ప్రకటన ప్రకారం, 2014-19లో పూర్తిగా / పాక్షికంగా AP లో పడిపోయింది, 2009-14లో సంవత్సరానికి రూ .886 కోట్ల నుండి సంవత్సరానికి రూ .2,830 కోట్లకు పెరిగింది. ఈ విధంగా, 2009-14 సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపు కంటే 219% పెరుగుదల. 2019-20లో బడ్జెట్ కేటాయింపులను రూ .3,885 కోట్లకు పెంచారు, 2020-21లో దీనిని రూ .4,910 కోట్లకు పెంచారు మరియు 2021-22లో ఈ ప్రాజెక్టుల కోసం అత్యధికంగా రూ. 5812 కోట్లకు బడ్జెట్ వ్యయం ప్రతిపాదించబడింది.

    ప్రస్తుతం ఏపీకి కేటాయించిన ప్రాజెక్టులు.. వాటికి అయ్యే ఖర్చు.. ఇప్పటి వరకు ఎంత వరకు నిధులు విడుదల అయ్యాయి. గత మూడేళ్ల కాలంలో ఏఏ ప్రాజెక్టులు ఏపీకి కేటాయించబడ్డాయి అన్న వివారాలను పరిమల్ నత్వాని అడిగి తెలుసుకున్నారు. గత మూడేళ్ల కాలంలో 4 డబుల్ లైన్లు పూర్తి చేశామని.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని.. 5 రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులు ఆమోదం తెలిపినట్టు మంత్రి సమాధానం ఇచ్చారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Central Government, Indian Railway, Parimal Nathwani, Piyush Goyal, Railways, Rajya Sabha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు