అందుకోసం జగన్ కాళ్లయినా పట్టుకుంటా.. 30 ఇయర్స్ పృథ్వీ

పృథ్వీరాజ్‌కు సినిమా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదని, 2020 వరకు తన కాల్షీట్లు ఫుల్లుగానే ఉన్నాయన్నారు.

news18-telugu
Updated: August 4, 2019, 5:16 PM IST
అందుకోసం జగన్ కాళ్లయినా పట్టుకుంటా.. 30 ఇయర్స్ పృథ్వీ
జగన్ మోహన్ రెడ్డితో 30 ఇయర్స్ పృథ్వీ (File)
news18-telugu
Updated: August 4, 2019, 5:16 PM IST
30 ఇయర్స్ పృథ్వీగా సుపరిచితుడైన నటుడు, ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్వీబీసీ చరిత్రలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడబోనని ఒట్టుపెట్టుకున్నానని, కొండ దిగితే మాత్రం తాను వైసీపీ హార్డ్ కోర్ టెర్రరిస్టునని స్పష్టం చేశారు. అయితే, ఎస్వీబీసీకి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని పృథ్వీ రాజ్ అన్నారు. అందుకోసం అవసరమైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి కాళ్లు కూడా పట్టుకోవడానికి తాను సందేహించనని స్పష్టం చేశారు. తాను ఛైర్మన్ కాబట్టి ఈగోలకు పోనని, వారితో పాటు కలసి వారిలాగానే ఐడీ కార్డు వేసుకుని పనిచేస్తానన్నారు. ఎస్వీబీసీ గత ఛైర్మన్ రాఘవేంద్రరావుతో తనకు పోలిక వద్దన్నారు. గతంలో ఎస్వీబీసీలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెస్తామన్నారు.

పృథ్వీరాజ్‌కు సినిమా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదని, 2020 వరకు తన కాల్షీట్లు ఫుల్లుగానే ఉన్నాయన్నారు. అయితే, కొందరు నిర్మాతలు తనను తీసేయడానికి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. తాను కూడా ఓ నలుగురు నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లను వెనక్కిచ్చేశానని చెప్పారు. పోసాని కృష్ణమురళితో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. పోసాని తనకు అన్నలాంటి వాడని చెప్పారు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...