శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు కావాలనే తనను కుట్రపన్ని ఇరికించారని మండిపడ్డారు. అయితే, అది వైసీపీలోని వాళ్లా?, ప్రతిపక్షాలా? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పృథ్వీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాను ప్రకటించారు. అనంతరం దీని వెనుక కొన్ని కుట్రలు ఉన్నాయని చెప్పారు.
పృథ్వీరాజ్ ఆరోపణలు...
‘నన్ను ఏ రకంగా దెబ్బకొట్టాలని ఒకటే ఆలోచించారు. నా గొంతు నొక్కేయాలని చూశారు. నేను శబరిమలలో ఉన్నప్పుడు మీడియా మిత్రుడు ఒకరు ఫోన్ చేశారు. అతని పేరు మాత్రం నేను చెప్పను. నా మీద పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నా మీద కుట్ర చేయడం ఏంటి? నేనేమన్నా స్కాముల్లో ఉన్న మంత్రినా?, హత్యలు చేశానా?, రౌడీ షీటర్నాఅనుకున్నా. నా వాయిస్ కొంతమందికి అడ్డంగా ఉందని చెప్పాడు. ఆ గొంతు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు. చైర్మన్ పదవిలో ఉంచకూడదని, అదఃపాతాళానికి తొక్కేయాలని కుట్ర చేసినట్టు చెప్పారు. కానీ, నేను స్వామిని నమ్ముకున్నా. అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అది ఇంతవరకు దారితీస్తుందనుకోలేదు.’ అని పృథ్వీరాజ్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 30 Years Prudhvi Raj, Andhra Pradesh, Svbc, Ttd, Ysrcp