తిరుమల కొండపైనే మందు కొడుతున్న పృథ్వీ... ఆడియో టేప్ లీక్ చేసిన వ్యక్తి మరో సంచలన ఆరోపణలు...

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తిరుమల కొండ మీద ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్‌లోనే మద్యం తాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.

news18-telugu
Updated: January 12, 2020, 3:18 PM IST
తిరుమల కొండపైనే మందు కొడుతున్న పృథ్వీ... ఆడియో టేప్ లీక్ చేసిన వ్యక్తి మరో సంచలన ఆరోపణలు...
30 ఇయర్స్ పృథ్వీ ఫైల్ ఫోటో
  • Share this:
శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పృథ్వీరాజ్ మీద ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పృథ్వీ తిరుమల కొండ మీద ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్‌లోనే మద్యం తాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఛానెల్ పనిచేసే ఓ యువతితో పృథ్వి రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేపులను కందారపు మురళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పృథ్వీ మీద మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఓ కామాంధుడు ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ కావడం దారుణం. అతన్ని వెంటనే చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించాలి. నటుడు పృథ్వీ ఉద్యోగులను బూతులు తిట్టడం, ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నారు. సినిమాల్లో హాస్యం పండించే ఆయన ఇక్కడ శృంగారం ఒలకబోస్తున్నారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీలో ఇక వెంకటేశ్వర స్వామి వైభవం చూపుతారా... లేక పృథ్వీరాజ్ లీలలు చూపుతారో చెప్పాలి. ఉద్యోగుల పరిచయ సమయంలో కులం అడిగిన ఘనుడు పృథ్వీ . ఛానెల్ కార్యాలయంలోనే ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిడానికి పృథ్వీ యత్నిస్తున్నారు. 36 ఉద్యోగాలు ఇప్పించి పృథ్వీ లక్షల రూపాయలు దండుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆయన్ను మందలించారు. చివరకు 30 మందిని తొలగించారు.’ అని కందారపు మురళి ఆరోపించారు.

ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో పృథ్వీరాజ్ రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేప్ బయటకు వచ్చింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆ ఆడియో టేప్ వైరల్‌గా మారింది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆడియో టేపు వ్యవహారంపై పృథ్వితో కూడా ఆయన మాట్లాడానన్నారు. అయితే ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని పృథ్వీ తనతో చెప్పారన్నారు వైవీ సుబ్బారెడ్డి. నివేదిక వచ్చాక తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు.
First published: January 12, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading