సీఎం జగన్‌ని టార్గెట్ చేసిన 30 ఇయర్స్ పృథ్వీ..?

వైఎస్ జగన్, పృథ్వీ రాజ్

30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఈ ఏడాది ఆరంభంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఎస్వీబీసీ ఛైర్మన్‌ హోదాలో ఉన్న ఆయన.. ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది.

 • Share this:
  SVBC (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్) మాజీ ఛైర్మన్, సినీ నటుడు పృథ్వీ రాజ్ టిక్ టాక్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎవరినీ నమ్మవద్దని.. కల్తీ వ్యక్తులు పాలిస్తున్న కాలమిది.. అంటూ ఆయన వీడియో చేశారు. ఆ వీడియో సీఎం జగన్‌ను ఉద్దేశించే చేశారని.. టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. కల్తీ నాయకులు అంటే ఎవరో..? ఈయన వైసీపీ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారో? అని ప్రశ్నిస్తున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించడంతోనే జగన్‌పై విమర్శలు చేశారన్న అభిప్రాయపడుతున్నారు.

  'మన' అని ఎవరినీ నమ్మొద్దు. ఎందుకంటే ఇది తాతల నాటి యుగం కాదు. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం. మన ముందు మన మాట మాట్లాడతారు. వాడి ముందు వాడి మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  పృథ్వీ రాజ్


  30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఈ ఏడాది ఆరంభంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఎస్వీబీసీ ఛైర్మన్‌ హోదాలో ఉన్న ఆయన.. ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పృథ్వీ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం వైసీపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు పృథ్వీ. ఈ విషయంలో సీఎం జగన్ తనకు అండగా నిలవలేదని...అసలేం జరిగిందో తెలుసుకోకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పృథ్వీరాజ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌లోనే కల్తీ నాయకులు అంటూ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: