నన్ను పెట్టుకోకపోతే వాళ్ల ఖర్మ.. జగన్ గెలుపు ఇండస్ట్రీకి ఇష్టం లేదంటున్న పృధ్వీ

చంద్రబాబునాయుడు గెలిచి ఉంటే ఉదయం ఫ్లైట్‌కే ఇండస్ట్రీ పెద్దలంతా అమరావతిలో వాలిపోయే వారని ఎద్దేవా చేశాడు.

news18-telugu
Updated: July 28, 2019, 2:52 PM IST
నన్ను పెట్టుకోకపోతే వాళ్ల ఖర్మ.. జగన్ గెలుపు ఇండస్ట్రీకి ఇష్టం లేదంటున్న పృధ్వీ
కమెడియన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వీ
news18-telugu
Updated: July 28, 2019, 2:52 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రావడం సినిమా ఇండస్ట్రీకి ఇష్టం లేదని 30 ఇయర్ పృధ్వీ ఆరోపించాడు. అదే చంద్రబాబునాయుడు గెలిచి ఉంటే ఉదయం ఫ్లైట్‌కే ఇండస్ట్రీ పెద్దలంతా అమరావతిలో వాలిపోయే వారని ఎద్దేవా చేశాడు. ఒక పువ్వు తీసుకుని వెళ్లి ఇస్తే వాళ్ల సొమ్మేం పోతుందని ప్రశ్నించాడు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తికి జగన్ గెలుపు కూడా వినపడలేదని, ‘ఔనా, జగన్ గెలిచాడా?’ అని వెటకారం చేశారంటూ చెప్పుకొచ్చాడు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన వారికి అవకాశాలు ఇవ్వొద్దంటూ ఇండస్ట్రీలో చెబుతున్నారని, ఎవరో వేషాలిస్తారని నమ్ముకుని తాను ట్రంక్ పెట్టె పట్టుకుని తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ రాలేదని చెప్పారు. అయినా, తనకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు ఖడ్గం, శ్రీఆంజనేయం, లౌక్యం సినిమాలేవీ వైసీపీ వాళ్లు అవకాశాలు ఇచ్చినవి కావన్నారు. తనను తీసుకుంటే బావుంటుందని భావిస్తే తీసుకుంటారని, ఒకవేళ పెట్టుకోకపోతే వారి ఖర్మ అంటూ వేదాంతం వల్లించారు. తాను గుర్తింపును చంపుకొని, ఒకరి మోచేతి కింద నీళ్లు తాగి బతకాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను బంతిలాంటి వాడినని, అది ఎంత కొడితే అంత పైకి ఎగురుతుందని చెప్పారు.

సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఓట్లు వేయొద్దని పృధ్వీ రాజ్ పిలుపునిచ్చాడు. సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లు వస్తారని, అయితే గ్రామాలు బాగుండాలని వారు హరి సంకీర్తనలు చేస్తారన్నారు. కానీ, సినిమా వాళ్లు మధ్యలో వచ్చి ఏదోదే చేసేసి వెళ్లిపోదామంటే ఏం జరుగుతుందో ప్రజలు చూపించారని అన్నారు. తాను వైసీపీ టెర్రరిస్ట్‌ని అని పృధ్వీరాజ్ ప్రకటించుకున్నాడు.


2013 నుంచి వైసీపీలో ఉన్న పృధ్వీ రాజ్‌‌ను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన SVBC ఛానల్‌‌కు చైర్మన్‌గా నియమించారు. ఈనెల 28న ఆయన ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఎస్వీబీసీ చానల్ చైర్మన్‌గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతం అని చెప్పారు. గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును బీట్ చేస్తానని చెప్పనని, తన పని తాను చేసుకుని పోతానన్నారు.
First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...