బీజేపీకి షాక్... టీఆర్ఎస్‌లో చేరిన ముగ్గురు కార్పొరేటర్లు

టీఆర్ఎస్‌లో చేరిన కార్పొరేటర్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన చూసి, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరినట్లు కార్పొరేటర్లు తెలిపారు.

  • Share this:
    నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలిది. ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌ల‌సలు మొద‌ల‌య్యాయి. బీజేపీకి చెందిన ముగ్గురు నగర పాలక సంస్థ కార్పొరేటర్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్ బీజేపీ 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్, 9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) గులాబీ గూటిలో చేరిపోయారు. హైదరాబాద్‌లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన చూసి, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరినట్లు కార్పొరేటర్లు తెలిపారు. వారికి మంత్రి, స్థానిక ఏమ్మెల్యే పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్నా అభివృద్దిని చూసి పార్టీలో చేరిన కార్పోరేట‌ర్ల‌కు స్వ‌ాగ‌తం ప‌లుకుతున్నానని అన్నారు. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టి నిజామాబాద్ కార్పొరేషన్ వార్డులను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published: