హోమ్ /వార్తలు /politics /

AP 3 Capitals Issue: మూడు రాజధానులపై హైకోర్టు విచారణ ముగిస్తుందా..? రైతుల వ్యూహమేంటి..!

AP 3 Capitals Issue: మూడు రాజధానులపై హైకోర్టు విచారణ ముగిస్తుందా..? రైతుల వ్యూహమేంటి..!

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఏపీ హైకోర్టు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ఇటీవల మూడు రాజధానులు ( 3 Capitals Bill), సీఆర్డీఏ రద్దు బిల్లులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రకటించడానికి ముందే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు హైకోర్టు ముందుకు వచ్చింది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ఇటీవల మూడు రాజధానులు ( 3 Capitals Bill), సీఆర్డీఏ రద్దు బిల్లులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రకటించడానికి ముందే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రోజే అసెంబ్లీలో రిపీల్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తాజాగా మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును అఫిడవిట్ కు అనుబంధంగా ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే బిల్లులును వెనక్కి తీసుకున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీబాగ్ ఒప్పాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను వెనక్కి తీసుకున్నందున రైతుల పిటిషన్లపై విచారణ ముగించాలని ఇప్పటికే హైకోర్టును కోరింది.

ఇది చదవండి: మూడు రాజధానులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన టెక్నికల్, లీగల్ అంశాలు ఇవేనా...? అందుకే జగన్ వెనక్కి తగ్గారా..?


ఐతే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత న్యాయబద్ధత లేదని రైతుల తరపు న్యాయవాదులంటున్నారు. అలాగే చట్టాలను వెనక్కి తీసుకున్నా మళ్లీ బిల్లు పెడతామనడంపై రాజధాని పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీటిపై సోమవారం వాదనలకు వినిపించేందుకు రైతుల తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‍లో ఉన్న బిల్లులను రైతుల తరపు న్యాయవాదులు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు విచారణను ముగిస్తుందా..? లేక రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని కొనసాగిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది చదవండి: ఏపీ మూడు రాజధానుల బిల్లుపై అనూహ్య పరిణామాలు... ఆమోదం నుంచి రద్దు వరకు ఏం జరిగిందంటే..!


ఇదిలా ఉంటే ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం మూడు మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును వెనక్కి తీసుకునే సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు.. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత మెరుగు పరుస్తామని సీఎం వెల్లడించారు. ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సవివరమైన బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని జగన్ ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 2014లో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదు.. తన ఇల్లు కూడా ఉందన్నారు.

First published:

Tags: Amaravathi, Andhra Pradesh, Ap capital, AP High Court

ఉత్తమ కథలు