Home /News /politics /

28 YEARS LATER CONGRESS DISCOVERED BJP ROLE IN RAJEEV GANDHI MURDER MS

రాజీవ్ హత్య.. బీజేపీ ప్రమేయం ఉందని 28 ఏళ్ల తర్వాత కనిపెట్టారా? : కాంగ్రెస్‌పై జైట్లీ

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(File)

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(File)

మోదీ వ్యాఖ్యలపై అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మాట్లాడారు. విద్వేషం కారణంగానే రాజీవ్ గాంధీ చనిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించినా సరే.. అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించలేదన్నారు.

ఇంకా చదవండి ...
    దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. భ్రష్టాచార్ నంబర్ వన్ అంటూ రాజీవ్‌పై మోదీ చేసిన అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. అసలు రాజీవ్‌ను బలితీసుకున్నది బీజేపీనే అని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంమంత్రి అరుణ్ జైట్లీ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

    రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి 1991 నుంచి 2004 వరకు ఇప్పటి మిత్రపక్షం డీఎంకెపై కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని జైట్లీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకె అప్పట్లో వైదొలగిందని అన్నారు. రాజీవ్ హత్య జరిగిన 28ఏళ్ల తర్వాత ఆ హత్య వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుందన్నారు.


    మోదీ వ్యాఖ్యలపై అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మాట్లాడారు. విద్వేషం కారణంగానే రాజీవ్ గాంధీ చనిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించినా సరే.. అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించలేదన్నారు. బీజేపీ కూడా అప్పుడు వీపీ సింగ్ నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిందిపోయి సమర్థించిందని గుర్తుచేశారు.



    First published:

    Tags: Narendra modi, Rajiv Gandhi

    తదుపరి వార్తలు