అతన్ని వదలొద్దు.. ఆర్నెళ్లుగా ఏడవని రోజు లేదు : కలకలం రేపుతోన్న యువతి ఆత్మహత్య

Girl Suicide In Suryapet : రెండు నెలల క్రితం ఒకరోజు నందిని వద్దకు వచ్చిన బాలరాజు తమ్ముడు.. ఆమె సెల్‌ఫోన్ లాక్కుని అందులో బాలరాజు ఫోటోలను డిలీట్ చేసి, ఫోన్ పగలగొట్టి వెళ్లాడు. బాలరాజు తప్పించుకుని తిరుగుతుండటంతో ఫిబ్రవరి 13న ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌లో పలు వివరాలు రాసింది.

news18-telugu
Updated: March 29, 2019, 8:22 AM IST
అతన్ని వదలొద్దు.. ఆర్నెళ్లుగా ఏడవని రోజు లేదు : కలకలం రేపుతోన్న యువతి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 29, 2019, 8:22 AM IST
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో పోకబత్తిని నందిని(25) ఆత్మహత్య కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు.. చివరకు చేతులెత్తేయడంతో తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చదువు, ఉద్యోగంతో తన లోకమేదో తనది అంటూ బతికిన తనకు ప్రేమ అంటూ వచ్చి అలజడి రేపిన అతగాడు.. చివరాఖరికి తనను దారుణంగా వంచించడంతో.. బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే.. నేరేడుచర్ల పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నందినికి కొన్నాళ్లుగా బాలరాజుతో పరిచయం ఉంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సమయంలో అతనితో పరిచయం ఏర్పడినట్టు సమాచారం. పరిచయమైన కొన్నాళ్లకు బాలరాజు ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. నందిని ఎంత తిరస్కరించినా.. బాలరాజు పట్టు వీడకపోవడంతో చివరకు ఆమె కూడా ఒప్పుకుంది.బాలరాజుపై నమ్మకంతో అతనికి శారీరకంగా కూడా దగ్గరైంది. అయితే ఇటీవల పెళ్లి గురించి అడగ్గా.. ఇంట్లో ఒప్పుకోవడం లేదని బాలరాజు సన్నాయి నొక్కులు నొక్కాడు. నువ్వే ఇంటికొచ్చి మాట్లాడుకో అని చెప్పడంతో.. నందిని అతని ఇంటికెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే బాలరాజు కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్ర దుర్భాషలాడి బయటకు గెంటేశారు.

రెండు నెలల క్రితం ఒకరోజు నందిని వద్దకు వచ్చిన బాలరాజు తమ్ముడు.. ఆమె సెల్‌ఫోన్ లాక్కుని అందులో బాలరాజు ఫోటోలను డిలీట్ చేసి, ఫోన్ పగలగొట్టి వెళ్లాడు. బాలరాజు తప్పించుకుని తిరుగుతుండటంతో ఫిబ్రవరి 13న ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌లో పలు వివరాలు రాసింది.

చదువే లోకంగా ఉద్యోగమే ధ్యాసగా బతుకుతున్న నా జీవితంలోకి ఓ మోసగాడు వచ్చి నా కుటుంబానికి దూరం చేస్తున్నాడు. చచ్చిపోయేలా బెదిరించాడు. ఆర్నెళ్లుగా నేను ఏడవని రోజు లేదు. ప్రేమిస్తున్నానని వెంటపడి.. నీవు లేకపోతే బతకలేనని, నీకోసం ఇంట్లోవాళ్లను ఎదిరించడానికైనా సిద్దమని అన్నాడు. మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఇప్పుడేమో దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కులం పేరుతో దూషించి నన్ను చనిపోయేలా వేధించారు.. అతన్ని, అతని కుటుంబాన్ని వదలొద్దు.- నందిని సూసైడ్ నోట్


First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...