213 VOTES RECORDED ON SAME ADDRESS IN MARKAPURAM TOWN OF PRAKASHAM DISTRICT IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN
AP Municipal Elections: ఒకే ఇంట్లో 213 ఓట్లు.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..
ప్రతీకాత్మకచిత్రం
ఎన్నికల (AP Municipal Elections) సమయంలో ఓట్లు, ఓటర్ల లిస్టులు చర్చనీయాంశమవుతాయి. సినిమా హీరోల పేర్లతో ఓట్లు, ఓటర్ కార్డులపై హీరో, హీరోయిన్ల ఫోటోలు దర్శనమిచ్చిన ఘటనలో చాలానే చోటు చేసుకున్నాయి.
ఎన్నికల సమయంలో ఓట్లు, ఓటర్ల లిస్టులు చర్చనీయాంశమవుతాయి. సినిమా హీరోల పేర్లతో ఓట్లు, ఓటర్ కార్డులపై హీరో, హీరోయిన్ల ఫోటోలు దర్శనమిచ్చిన ఘటనలో చాలానే చోటు చేసుకున్నాయి. అంతెందుకు కోళ్లు, కుక్కలు, ఆవులు, గేదెల ఫోటోలు కూడా ఓటర్ల లిస్టులో కనిపించిన సందర్భాలున్నాయి. అలాగే ఒకే పేరుతో పదుల కొద్దీ ఓట్లు ఉన్న ఘటనలు కూడా కొత్తేం కాదు. ఇక ఒకే ఇంట్లో 20 లేదా 30 ఓట్లు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఒకే ఇంట్లో ఓ 5 ఓట్లు ఉంటాయి. ఉమ్మడి కుటుంబంమైతే 10 నుంచి 20 ఓట్లు కూడా ఉంటాయి. కానీ ఓ ఇంట్లో ఏకంగా 200లకు పైగా ఓట్లు ఉన్నాయి. అవును అది నిజమే.. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ కాలనీలోని ఓ ఇంట్లో ఏకంగా 200 ఓట్లు ఉన్నాయి. 9వ వార్డులోని ఇంటినెంబర్ 101-1 నెంబర్ గల ఇంట్లో 213 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఒకే ఇంటి నెంబర్ తో ఇన్ని ఓట్లు ఉండటం చూసి అధికారులు షాకయ్యారు. మార్కాపురం పట్టణంలోని 9వ బ్లాక్ లో మొత్తం 1732 ఓట్లు ఉండగా 213 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయి. దీని వెనుక మార్కాపురంలో రకరకాల చర్చ జరుగుతోంది.
ఐతే ఓట్ల నమోదు సందర్భంగా జరిగిన అవకతవకలే ఇందుకు కారణంగా తెలుస్తోది. అసలు 101-1 డోర్ నెంబర్ తో అసలు ఇల్లే లేనట్లుగా తెలుస్తోంది. ఇక్కడ నమోదైన ఓట్లన్ని ఓ పార్టీ నేతకు చెందిన కాలేజీ విద్యార్థులుగా గుర్తించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఓటర్లను గుర్తించి నమోదు చేయాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఈ ఓట్లు ఉన్న కాలనీలో పోరు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఈ ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఓట్ల నమోదు ప్రక్రియపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.