20 ఏళ్ల తర్వాత ఎన్డీయే సర్కారులో అన్నాడీఎంకే భాగస్వామ్యం
తమిళనాడు నుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ ఓపీ రవీంద్రనాథ్ కుమార్ మోడీ కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు.
news18-telugu
Updated: May 30, 2019, 2:49 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: May 30, 2019, 2:49 PM IST
మోదీ కేబినెట్లో అన్నాడీఎంకే ఎంపీ చోటు దక్కించుకోనున్నారు. తద్వారా దాదాపు 20 ఏళ్ల విరామానంతరం ఎన్డీయే సర్కారులో అన్నాడీఎంకే భాగస్వామ్యంకానుంది. 20 ఏళ్ల క్రితం వాజ్‌పేయి సర్కారుకు జయలలిత మద్దతు ఉపసంహరించుకుని, ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ కలిసి పోటీ చేయగా ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఓపీ పన్నీర్ సెల్వం తనుయుడు ఓపీ రవీంద్రనాథ్ కుమార్ మాత్రమే తేని లోక్‌సభ నియోజకవర్గం నుంచి 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
మోడీ కేబినెట్లో ఓపీ రవీంద్రనాథ్ కుమార్‌కు చోటు దక్కనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. మోడీ కేబినెట్లో చేరనుండడంపై న్యూస్18తో మాట్లాడిన రవీంద్రనాథ్ కుమార్...అంతా అమ్మ(జయలలిత) ఆశీస్సులని పేర్కొన్నారు.
మోదీ కేబినెట్లో చోటు కోసం అన్నాడీఎంకే నుంచి ఓపీ రవీంద్రనాథ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు ఆర్.వైద్యలింగం మధ్య పోటీ నెలకొంది. అన్నాడీఎంకేలో ఓపీఎస్ వర్గం రవీంద్రనాథ్ కుమార్ పేరును ప్రతిపాదించగా...సీఎం ఈ.పన్నీర్ సెల్వం వర్గం రాజ్యసభ సభ్యుడు వైద్యలింగంకు కేంద్ర మంత్రి పదవి దక్కేలా ప్రయత్నాలు చేశాయి. చివరకు రవీంద్రనాథ్ కుమార్‌ను కేబినెట్లోకి తీసుకోవాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చివరగా 1998లో వాజ్‌పేయి సర్కారులో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండగా...జయలలిత కేబినెట్ నుంచి వైదొలగడంతో వాజ్‌పేయి 13 మాసాల సర్కారు కూలిపోయింది.

‘విశ్వాసం లేని కుక్క.. తెగిన చెప్పుతో కొట్టాలి’... కాంగ్రెస్ ఎంపీపై మంత్రి వివాదాస్పద వ్యా
జయలలిత సమాధి వద్ద పెళ్లి.. కొత్త జంటకు అమ్మ ఆశీర్వాదం
వేలూరులో డీఎంకే అభ్యర్థి గెలుపు... హోరాహోరీ పోరు
జయలలిత మేనకోడలు దీప రాజకీయాలకు గుడ్ బై...
రాజకీయాలకు గుడ్‌బై...జయలలిత మేనకోడలు సంచలన నిర్ణయం
తమిళనాట జయలలితకు గుడికట్టన అన్నాడీఎంకే కార్యకర్తలు