చంద్రబాబు దీక్షకు ఆ ఎమ్మెల్యేలు డుమ్మా.. టీడీపీలో ఏం జరుగుతోంది..?

టీడీపీలో కీలక నేతలు పార్టీ వీడతారని వంశీ బాంబు పేల్చడం.. ఇసుక దీక్షకు కొందరు నేతలు హాజరుకాకపోవడం.. వంటి పరిణామాలతో టీడీపీలో అసలేం జరుగుతోందని టీడీపీ కార్యకర్తల్లో టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 15, 2019, 3:59 PM IST
చంద్రబాబు దీక్షకు ఆ ఎమ్మెల్యేలు డుమ్మా.. టీడీపీలో ఏం జరుగుతోంది..?
చంద్రబాబు ఇసుక దీక్ష
  • Share this:
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై ఆంధ్రాలో రచ్చ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్యే గురువారం విజయవాడలో చంద్రబాబు ఇసుక కొరతకు నిరసనగా దీక్ష చేపట్టారు. ధర్నాచౌక్‌లో 12 గంటల పాటు దీక్ష చేశారు. ఐతే ఆ ఇసుక దీక్షకు టీడీపీ నుంచే స్పందన కరువైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జన సమీకరణ గురించి పక్కన బెడితే.. ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలే డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు ఇసుక దీక్షకు రాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అమెరికాలో ఉండడంతో ఆయన దీక్షకు రాలేకపోయారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చంద్రబాబు ఇసుక దీక్షకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్,మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, బెందాళం అశోక్ దీక్ష హాజరు కాలేదు.

కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో రాలేకపోగా మిగిలిన వాళ్లు ఎలాంటి కారణం లేకుండానే దీక్షకు హాజరుకానట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదో దూర ప్రాంతంలో అయితే రాలేకపోయారని భావించవచ్చు. కానీ ఏపీ నడిబొడ్డున ఉన్న విజయవాడలో పార్టీ అధినేత దీక్ష చేసినా.. ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశమైంది.


ఇప్పటికే బీజేపీ, వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ ఉక్కిరిబిక్కిరివుతోంది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. అతి త్వరలోనే వైసీపీలో చేరతానని క్లారిటీ ఇచ్చారు వంశీ. ఐతే టీడీపీలో కీలక నేతలు పార్టీ వీడతారని బాంబు పేల్చడం.. ఇసుక దీక్షకు కొందరు నేతలు హాజరుకాకపోవడం.. వంటి పరిణామాలతో టీడీపీలో అసలేం జరుగుతోందని టీడీపీ కార్యకర్తల్లో టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.
First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...