ఆగని ఆత్మహత్యలు : 'ఫెయిల్' భయంతో పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం

పట్టణంలోని ఇర్ఫాన్ నగర్‌లో నివసించే ఫిజా ఫెర్దోస్(15) అనే విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. అయితే త్వరలో ఫలితాలు వెల్లడికానుండటంతో రెండు సబ్జెక్టులు సరిగా రాయలేదని తల్లిదండ్రుల వద్ద ఆందోళన చెందుతోంది.

news18-telugu
Updated: May 7, 2019, 5:49 PM IST
ఆగని ఆత్మహత్యలు : 'ఫెయిల్' భయంతో పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమ్రం భీమం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఇర్ఫాన్ నగర్‌లో నివసించే ఫిజా ఫెర్దోస్(15) అనే విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. అయితే త్వరలో ఫలితాలు వెల్లడికానుండటంతో రెండు సబ్జెక్టులు సరిగా రాయలేదని తల్లిదండ్రుల వద్ద ఆందోళన చెందుతోంది.

ఇదే క్రమంలో సోమవారం బాత్రూమ్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలతో ఫెర్దోస్ మృతి చెందినట్టు కాగజ్‌నగర్ ఎస్ఐ కిరణ్ తెలిపారు.కాగా, ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో అవకతవకల కారణంగా దాదాపు 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పదో తరగతి విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన రేకెత్తిస్తోన్న అంశం. విద్యార్థులు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వం చెబుతున్నా.. ఆత్మహత్యలకు తెరపడకపోవడం శోచనీయం.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>