చెప్పేదొకటి, చేసేదొకటి: కేసీఆర్‌పై చంద్రబాబు విమర్శలు

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఢిల్లీకి చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. కేసీఆర్ చెప్పేదొకటి, చేసెదొకటి అంటూ విమర్శలు గుప్పించారు.

Santhosh Kumar Pyata | news18-telugu
Updated: December 26, 2018, 5:05 PM IST
చెప్పేదొకటి, చేసేదొకటి: కేసీఆర్‌పై చంద్రబాబు విమర్శలు
చంద్రబాబు, కేసీఆర్, మోదీ
  • Share this:
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దూకుడుగా ముందుకెళ్తూ పలు రాష్ట్రాల నేతలను కలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనపై.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి అంటూ సెటైర్లు వేశారు. ఒకవైపు దేశంలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి కడతానంటున్న కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలవడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకోసం మోదీని కలుస్తున్నారో చెప్పాలన్నారు. బ్రీఫింగ్ చేయడానికి వెళ్లారా? లేక రాష్ట్ర సమస్యలను విన్నవించడానికి వెళ్లారా? నిన్నటి దాకా ఫెడరల్ ఫ్రంట్ అంటూ చర్చలు జరిపిన కేసీఆర్.. మళ్లీ మోదీనెందుకు కలుస్తున్నారో? అంటూ సెటైర్లు వేశారు.
ఇంతకు ముందు కేసీఆర్, నవీన్ పట్నాయక్‌ల భేటీపైనా స్పందించిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడంపైనే వారి చర్చ జరిగిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. తాజాగా.. కేసీఆర్, మోదీల భేటీపైనా స్పందించారు. కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటి అని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానన్న వ్యక్తి.. మళ్లీ మోదీ దగ్గరికెందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రత్యేక విమానంలో పలు రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ్ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసి చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన ఆయన.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 26, 2018, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading