కేసీఆర్‌ది అరాచకం... టీఆర్ఎస్ హయాంలో దారుణాలు: విజయశాంతి

కేసీఆర్‌ది అరాచకం... టీఆర్ఎస్ హయాంలో దారుణాలు: విజయశాంతి

కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటో)

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి యథా రాజా... తథా ప్రజ అన్నట్టుందని మండిపడ్డారు. కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అరాచకంగా టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారని ధ్వజమెత్తారు.

 • Share this:
  తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి యథా రాజా... తథా ప్రజ అన్నట్టుందని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అరాచకంగా టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని... వాటిని అడ్డుకున్న పోలీసులపై కొందరు దురుసుగా ప్రవర్తించారని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇలాంటి అరాచకాలను ఎవరూ సహించబోరని విజయశాంతి అన్నారు.

  ఎన్నికల ప్రచార సమయంలోనూ టీఆర్ఎస్‌పై మాటల దాడి చేసిన విజయశాంతి... అదే పంథాను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేయొచ్చనే ప్రచారం జరిగినా... ఆమె మాత్రం బరిలోకి దిగలేదు. అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా... కాంగ్రెస్ తరపున టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చే విషయంలో విజయశాంతి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని అర్థమవుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు