Home /News /politics /

100 HOSPITALIZED DUE TO CONTAMINATED DRINKING WATER IN KARNOOL DISTRICT MINSTER ALLA NANI VISITED GNT NGS

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో కలుషిత నీరు కలకలం. ఆతిసార వ్యాధిపై మంత్రి ఆళ్ల నాని కీలక ఆదేశాలు

అతిసారపై మంత్రి ఆళ్ల నాని కీలక ఆదేశాలు

అతిసారపై మంత్రి ఆళ్ల నాని కీలక ఆదేశాలు

ఏపీలో అతిసార మళ్లీ భయపెడుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో కలుషిత నీరు తాగి స్థానిక ప్రజలు అస్పత్రుల పాలయ్యారు. దీంతో హుటాహుటిన అక్కడికి వెళ్లిన వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని కీలక ఆదేశాలు జారీ చేశారు.

    ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ కలుషిత నీరు కలవర పెడుతోంది. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని అరుణ్ జ్యోతి నగర్ లో కలుషిత నీరు తాగడంతో.. చాలామంది అతిసారకు గురయ్యారు. వారంతా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హుటాహుటిన డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. స్వయంగా మంత్రి క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి స్థానిక పరిస్థితులను ఎలా ఉన్నాయి అంటూ ఆరా తీశారు. ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రభుత్వం అన్నివేళలో బాధితులకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టం రాకుండా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.

    డిప్యూటీ సీఎంతో పాటు జిల్లామంత్రి గుమ్మనూరు జయరాం , ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కూడా అదోనిలో పర్యటించారు. స్థానికంగా అందుబాటులో ఉన్ననీటిపై పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చే వరకు ఇక్కడే ఉంటూ డయేరియా కేసులు తగ్గించాలని కర్నూలు ఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య ను మంత్రి ఆదేశించారు.

    కలుషిత నీరు తాగి మృతి చెందిన ఇంట్లో ఇప్పటికే నలుగురు విరేచనాలతో బాధ పడుతున్నారన్నారు. అరుణ జ్యోతి నగర్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో…? ప్రస్తుతం ఎంతమంది డయేరియాకు గురయ్యారు అన్నదాపై అధికారులు ఫోకస్ చేయాలన్నారు. ఆశ, ఏఎన్ఎం, వలంటీర్, డాక్టర్లు 15 వందల ఇండ్లకు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక మెడికల్ క్యాంపు వెంటనే ఏర్పాటు చేయాలని డిఎమ్ హెచ్ ను అదేశించారు. అరుణ జ్యోతి నగర్ లో రాత్రి పగలు 6 టీమ్ లతో కలిసి మెడికల్ క్యాంపు నిర్వహించి.. విరేచనాలు ఎక్కువ అయితే దగ్గర్లో ఉన్న అర్బన్ హెల్త్ హాస్పిటల్ కు వెంటనే చేర్చాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ లో 2 అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు.. అతిసార కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నారు.

    మరోవైపు ఆదోనికి డిప్యూటేషన్ పై గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ను నియమించాలిని డీఎంహెచ్వో ను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. డయేరియా కేసులు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ఆరోగ్యం సాధారణ స్థితికి తీసుకు రావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బందిని మరింత పెంచి బెడ్స్ సంఖ్య పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఆదోనిలో మంచినీటి సరఫరా విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదోనిలో సరఫరా చేస్తున్నమంచినీటి శాంపిల్స్ ను విజయవాడ ల్యాబ్ కి పంపించాలన్నారు మంత్రి ఆళ్ల నాని. అలాగే అతిసారతో మృతి చెందిన రంగమ్మ కుటుంబానికి వెంటనే 3 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు వైద్యశాఖ మంత్రి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Alla Nani, Andhra Pradesh, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు