జగన్ ప్రమాణ స్వీకారానికి జోరుగా ఏర్పాట్లు... 10 LED స్క్రీన్లు

AP New CM YS Jagan : ప్రమాణ స్వీకార ఏర్పాట్లను జగన్ సమీక్షించారు. తన ఇంట్లో అధికారులతో మాట్లాడారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఏర్పాట్ల వివరాల్ని చెప్పారు. భారీగా పోలీసు బందోబస్తుకి తోడు... డిజిటల్ తెరలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 6:21 AM IST
జగన్ ప్రమాణ స్వీకారానికి జోరుగా ఏర్పాట్లు... 10 LED స్క్రీన్లు
వైఎస్ జగన్
Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 6:21 AM IST
ఏపీ కొత్త సీఎంగా ఈ నెల 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్... ఇతర అధికారులతో చర్చించారు. నగరంలోని మెయిన్ జంక్షన్‌లలో LED డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఎండ కారణంగా అక్కడక్కడా షామియానాలు వేసి అవసరమైనచోట మంచినీరు, మజ్జిగ అందించబోతున్నారు. ఉయ్యూరులో LED స్క్రీన్ ఏర్పాటు చెయ్యాలనీ, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, లాయర్లు రాబోతున్నారు. భద్రతా సమస్యలు తలెత్తకుండా 5వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.

ప్రధాన వేదిక ముందుభాగంలో వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి ప్రత్యేక పాస్‌లు ఇవ్వనున్నారు. సిటీలో మెయిన్ జంక్షన్ల దగ్గర మొత్తం 10 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎక్కడికక్కడ షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏఆర్ గ్రౌండ్స్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లలో వాహనాల పార్కింగ్‌ ఉంటుంది.

30న మధ్యాహ్నం 12.23కి జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఐతే, ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఐజీఎం స్టేడియంలో వేదిక, వీవీఐపీ, విఐపీ, మీడియా, సామాన్య ప్రజలు చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...