కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన ఇండిపెండెంట్లు

కేటీఆర్ ఇలాఖా సిరిసిల్లలో ఇండిపెండెంట్లు ఈ స్థాయిలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: January 25, 2020, 12:31 PM IST
కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన ఇండిపెండెంట్లు
తెలంగాణ మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ వశమైంది. మొత్తం 39 వార్డుల్లో టీఆర్ఎస్ 24 స్థానాలు సాధించడంతో... ఆ పార్టీ గెలుపు ఖాయమైంది. అయితే మిగిలిన 15 స్థానాల్లో బీజేపీ 3, కాంగ్రెస్‌ 2 స్థానాలు గెలుచుకోగా... స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందడం విశేషం. కేటీఆర్ ఇలాఖాలో ఇండిపెండెంట్లు ఈ స్థాయిలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇండిపెండెంట్లుగా గెలుపొందిన వారిలో ఎక్కువమంది టీఆర్‌ఎస్‌కు చెందిన రెబల్స్‌గా తెలుస్తొంది. ఎన్నికలకు ముందుకు టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించిన చాలామంది... తమకు టికెట్ రాకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగారు.

వారిలో 10 మంది విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రెబల్స్‌ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల కారణంగా కొంతమంది పోటీ నుంచి తప్పుకోగా... మరికొందరు మాత్రం బరి నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. పోటీలో నిలిచి గెలిచారు. అయితే రెబెల్స్‌ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీంతో వీరంతా మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు