మరో వివాదంలో జొమాటో.. హిందూ సెంటిమెంట్స్‌తో ఆడుకుంటోందని డెలివరీ బాయ్స్ నిరసన

news18-telugu
Updated: August 12, 2019, 8:33 AM IST
మరో వివాదంలో జొమాటో.. హిందూ సెంటిమెంట్స్‌తో ఆడుకుంటోందని డెలివరీ బాయ్స్ నిరసన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చుట్టూ ఇటీవల వరుస వివాదాలు ముసురుకుంటున్నాయి. ముస్లిం వ్యక్తి చేత ఫుడ్ డెలివరీ చేయిస్తున్నారని ఓ హిందూ వ్యక్తి ఆర్డర్ క్యాన్సిల్ చేయడం.. ఫుడ్‌కు మతం లేదంటూ జొమాటో బదులివ్వడం మొన్నీమధ్యే వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా జొమాటోపై పలు ఆరోపణలు చేస్తూ కొంతమంది ఫుడ్ డెలివరీ బాయ్స్ రోడ్డెక్కారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా బీఫ్,పోర్క్ వంటి వంటకాలను సప్లై చేయిస్తున్నారని.. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని వారు తెలిపారు. జొమాటో మా మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని.. ఇకనైనా బీఫ్,పోర్క్ డెలివరీ సర్వీస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జొమాటో మా సెంటిమెంట్స్‌తో ఆడుకుంటోంది. మా చేత అన్నిరకాల ఫుడ్స్ డెలివరీ చేయిస్తోంది.హిందువులమైన మా చేత బీఫ్ డెలివరీ చేయిస్తున్న జొమాటో.. భవిష్యత్‌లో ముస్లిం సోదరుల చేత పోర్క్‌ను కూడా డెలివరీ చేయిస్తుంది. కాబట్టి మతపరమైన విశ్వాసాలతో జొమాటో ఆటలాడవద్దు. అలాగే డెలివరీ బాయ్స్ వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.-జొమాటో డెలివరీ బాయ్,కోల్‌కతా డెలివరీ బాయ్స్ నిరసనపై బెంగాల్ ఇరిగేషన్ మంత్రి రాజీవ్ బెనర్జీ స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మతపరమైన విశ్వాసాలకు వ్యతిరేకంగా జొమాటో డెలివరీ బాయ్స్‌పై బలవంతంగా ఏదీ రుద్దవద్దని చెప్పారు. మరోవైపు జొమాటో వాదన మరోలా ఉంది. విభిన్న మతాలు,కులాలు నివసించే భారతదేశంలో వెజిటేరియన్స్‌కు వెజిటేరియన్ బాయ్స్‌తో,నాన్ వెజిటేరియన్స్‌కు నాన్ వెజిటేరియన్ బాయ్స్‌తో డెలివరీ చేయించడం కష్టమంటోంది.
First published: August 12, 2019, 8:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading