Home /News /national /

ZIKA VIRUS CASES ARE INCREASING DAY BY DAY IN UTTAR PRADESH AND TOTAL CASES REACHED TO 89 TODAY PRV

Uttar Pradesh: యూపీలో హడలెత్తిస్తున్న జికా వైరస్​.. కేసులు పెరుగుతుండటంతో అధికారుల గుండెల్లో మొదలైన దడ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ పక్కన కరోనా పీడ వదలనే లేదు. మరోపక్క ఉత్తరప్రదేశ్​లో జికా వైరస్ హడలెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కేసులు హడలెత్తిస్తు.. శనివారం వరకు 79 కేసులు వెలుగుచూడగా.. తాజాగా..

ఓ పక్కన కరోనా పీడ వదలనే లేదు. మరోపక్క ఉత్తరప్రదేశ్​ (Uttar pradesh)లో జికా వైరస్ హడలెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ (zika virus) కేసులు హడలెత్తిస్తు.. శనివారం వరకు 79 కేసులు వెలుగుచూడగా.. తాజాగా ఆదివారం మరో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 89కి చేరింది. జికా కేసులు  పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi Adityanath) శనివారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శానిటైజేషన్‌ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫాగింగ్‌ డ్రైవ్‌ను చేపట్టాలని సూచించారు.

వాయుసేనలో పనిచేసే ఓ అధికారి..

అక్టోబరు 24న కాన్పూర్‌ (Kanpur)లో తొలి జికా కేసు (Zika first Case) నమోదైంది. వాయుసేనలో పనిచేసే ఓ అధికారి కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతూ వాయుసేన ఆస్పత్రిలో చేరారు. ఆయన వద్ద నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ప్రయోగశాలకు పంపించగా.. జికా (Zika) బారినపడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం.. ఆ అధికారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ మొదలుపెట్టి వారి రక్త నమూనాలను పరీక్షించారు. ఐఏఎఫ్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా టెస్టులు చేస్తున్నారు.

తొలిసారి 1947లో..

జికా వైరస్‌ (Zika Virus)ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియా (Nigeria)లో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ (Zika Viurs) 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

జికా బాధితులకు చికిత్సలో ఇప్పటివరకూ ఇతర వ్యాధుల నియంత్రణకు ఉద్దేశించిన ఔషధాలను వినియోగిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కట్టడిచేసే ప్రధాన లక్ష్యంతో ఔషధాలను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో అమెరికా ఫార్మా ‘మెర్క్’ ముందడుగు వేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ మాత్రను బ్రిటన్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీనిపై వచ్చేవారం సమీక్షించనుంది.

జికా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుందని, కీటకాలను వదిలించుకోవడమే వ్యాధి నుంచి సురక్షితమైన మార్గమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు నిఘా పెంచాలని మరియు డోర్ టు డోర్ శాంపిలింగ్ మరియు వ్యాధికి సంబంధించిన పరీక్షలను నిర్ధారించాలని ఆదేశించినప్పటికీ, IAF స్టేషన్ల హ్యాంగర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా హై అలర్ట్‌లో ఉంచారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Uttar pradesh, Zika Virus

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు