హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఏపీ రాజధానిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధానిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇలా వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై మాట మార్చడం పట్ల అటు అమరావతి రైతులతో పాటు ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై మాట మార్చడం పట్ల అటు అమరావతి రైతులతో పాటు ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై మాట మార్చడం పట్ల అటు అమరావతి రైతులతో పాటు ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంపై బొత్స మాట మార్చిన తర్వాత రోజే... సాయిరెడ్డి చెబుతున్న వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... ఎప్పటిలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఏపీలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు సాయిరెడ్డి. ఈ అభివృద్ధి ని చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

    మరోవైపురాజధాని అంశంపై స్పందిస్తూ.... ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని ఆయన మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతియే రాజధాని అని ప్రకటించిన తర్వాత మళ్లీ గొంతు సరిచేసుకున్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతేనని, మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వకంగా స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ మళ్లీ మాట మార్చారు. రాజధానిపై స్పష్టత కోసం ఓ కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దానిపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలా వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై మాట మార్చడం పట్ల అటు అమరావతి రైతులతో పాటు ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    First published:

    Tags: Amaravathi, Amaravati, Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Vijayasai reddy

    ఉత్తమ కథలు