Fighting Death : గుట్కా కోసం ఫైటింగ్... కత్తులతో వీరవిహరం... !

Fighting Death : గుట్కా కోసం ఫైటింగ్... కత్తులతో వీరవిహరం... !

Fighting Death : గుట్కా కోసం చెలరేగిన చిన్న వివాదం.. ఓ వ్యక్తి ప్రాణాలకు మీదకు తెచ్చింది. ఈగోలకు పోయిన ఇద్దరు యువకులు అందరు చూస్తుండగానే.. కత్తులతో దాడులకు దిగారు. దీంతో ఒకరు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.

  • Share this:
    ఢిల్లీలో ( Delhi ) జరిగిన ఓ గ్యాంగ్‌వార్‌లో ( Gang war ) యువకుడు ప్రాణాలు కొల్పోయాడు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకున్న యువకులు వీధి ఫైటింగ్‌కు ( Fighting ) దిగారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఈ దారణం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని షాహదారా ప్రాంతానికి చెందిన నరసింగ్ అదే ప్రాంతంలో ఒక పాన్‌షాపు ( panshop ) నడుపుతున్నాడు. ఒకరోజు నరసింగ్ షాపులో ఉండగా తన సోదరుడి కుమారుడు హేమంత్ అక్కడికి వచ్చాడు. హేమంత్‌తో పాటు అతని స్నేహితుడు ( friend ) కూడా వచ్చాడు. వారిద్దరూ నరసింగ్ షాపు వద్ద పాన్ తీసుకుందామని వచ్చారు. అదే సమయంలోనే షోయెబ్, సోహైల్ అనే ఇద్దరు వ్యక్తులు గుట్కా కోసం పాన్‌షాప్‌కు వచ్చారు. అప్పుడే హేమంత్ స్నేహితుడు తనకూ ఒక గుట్కా కావాలని అడిగాడు. దీంతో నరసింగ్ ముందుగా తనకు తెలిసిన హేమంత్ స్నేహితుడికి ఒక గుట్కా ఇచ్చాడు. కానీ షాపులో గుట్కాలు అయిపోయాయ్.. చివరి గుట్కా ప్యాకెట్ ను హెమంత్ స్నేహితుడికి ఇవ్వడంతో స్టాక్ అయిపోయింది. ఇదే విషయాన్ని షోయెబ్‌కు చెప్పాడు.

    అది చూసిన షోయెబ్.. ముందు తాను గుట్కా అడిగితే మరొకరికి ఇవ్వడమేంటని.. నరసింగ్‌ని తిడుతూ ఫైర్ ( fire ) అయ్యాడు. దీంతో అక్కడే ఉన్న హేమంత్ కలుగజేసుకొని తన బాబాయ్‌ని మరోమాట అలా అంటే బాగుండదని, అక్కడి నుంచి ముందు వెళ్లిపోమ్మని ( warning ) హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో స్థానికంగా ఉన్న హెమంత్ తన బాబాయ్‌తో పాటు మరికొంతమంది స్నేహితులతో కలిసి షోయబ్‌పై దాడి చేశాడు. షోయెబ్‌ని చితకబాది అక్కడి నుంచి పంపించాడు.

    ఇది చదవండి : ప్రేమించడం లేదని యువతి ఇంటినే తగులబెట్టాడు..


    కాని తనపై దాడిని మనసులో పెట్టుకున్న షోయబ్ కాసేపటి తరువాత షోయెబ్, సోహైల్ కొంత మందిని వెంట వేసుకొని వచ్చి పాన్ షాపుపై దాడి ( Attack ) చేశారు. ఈ దాడిలో నరసింగ్ తన షాపులోని కత్తెరను తీసుకొని షోయెబ్, సోహైల్‌పై దాడి చేశాడు. షోయెబ్‌కు ఆ కత్తెర ఛాతీలో దిగింది. సోహైల్‌కు వీపులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్త స్రావం కావడంతో వారిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లగా షోయెబ్ అప్పటికే మరిణించాడని డాక్టర్లు ( Doctors ) చెప్పారు. సోహైల్ పరిస్థితి కూడా విషయంగా ఉంది.

    ఇది చదవండి : మరదలిని ప్రేమించినందుకు బెదిరించిన మేనత్త, మామ.. సెల్ఫీ వీడియోతో యువకుడు దారుణం


    సమాచారం పోలీసులకు ( Police ) చేరడంతో నరసింగ్‌తో పాటు హేమంత్‌పై హత్య, హత్యా ప్రయత్నం కింద కేసులు నమోదు చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు.
    Published by:yveerash yveerash
    First published: