YOUTH ATTACKED A GIRL WITH ACID AT HER HOME IN UP HAPUR OVER STOPPED TALKING TO HIM FULL DETAILS HERE HSN
మాట్లాడటం మానేసిన యువతి.. ఫోన్స్ కూ నో రెస్పాన్స్.. రాత్రి పూట ఆ యువకుడు నేరుగా ఆమె ఇంటికెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజుల క్రితం వరకు తనతో మాట్లాడి, ఏ కారణం వల్లనో అతడితో దూరంగా ఉంటున్న యువతిపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడు ఆగ్రహం పెంచుకున్నాడు. రాత్రి పూట నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు..
యువత క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ యువకుడు ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు. కొద్ది రోజుల క్రితం వరకు తనతో మాట్లాడి, ఏ కారణం వల్లనో అతడితో దూరంగా ఉంటున్న యువతిపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడు ఆగ్రహం పెంచుకున్నాడు. ఓ యాసిడ్ బాటిల్ కొనుక్కున్నాడు. రాత్రి పూట నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టగానే, ఆ యువతి డోర్ తీసింది. అంతే, వెంటనే అతడు ఆ యువతిపై యాసిడ్ దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో హపూర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న కాలేజీలో చదువుకుంటోంది. కొద్ది కాలంగా ఓ యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోంది. అయితే కారణం ఏమిటో కానీ, ఆ యువకుడితో ఆమె మాట్లాడటం మానేసింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడికి ఉక్రోషం వచ్చింది. తనను కాదని వేరే వ్యక్తితో ప్రేమాయణం జరుపుతుందేమోన్న అనుమానం అతడిలో కలిగింది. దీంతో అతడు ఆదివారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.
ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే ఆ యువతి తలుపు తీసింది. అంతే అప్పటికే ఆమెపై పీకల్లోతు కోపంలో ఉన్న అతడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ను ఆమెపై పోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆమె తండ్రి స్థానిక ఆసుపత్రికి తరలించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే తన కూతురి వెంట ఓ యువకుడు పడుతున్నాడనీ, అతడే దీనికి కారణమయి ఉండొచ్చన్న తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆమె ఇంటికి వచ్చిన యువకుడిని గుర్తించారు. కేసు పెట్టిన ఆరు గంటల్లోనే ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.