టిక్ టాక్‌తో బీ కేర్ ఫుల్.. హద్దు మీరితే జీవితమే నాశనం.. ఇదిగో సాక్ష్యం..

తుపాకులతో వీడియోలు చేయడం నేరమని సంగతి వారికి తెలియదు. ఇలానే ఎంతో మంది అమాయకులు టిక్ టాక్‌ లైకుల కోసం తెలిసో.. తెలియక.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

news18-telugu
Updated: November 20, 2019, 3:26 PM IST
టిక్ టాక్‌తో బీ కేర్ ఫుల్.. హద్దు మీరితే జీవితమే నాశనం.. ఇదిగో సాక్ష్యం..
టిక్ టాక్‌తో జర జాగ్రత్త.. హద్దు మీరితే నేరుగా జైలుకే...
  • Share this:
టిక్ టాక్..! ఇప్పుడు ఎవరి ఫోన్‌లో చూసినా ఈ యాప్ కనిపిస్తుంది. టిక్ టాక్ పిచ్చితో కుర్రకారు ఊగిపోతోంది. స్కూలుకెళ్లే చిన్నపిల్లలు సైతం టిక్ టాక్‌ లోకంలో మునిగిపోతున్నారు. ఏది పడితే అది రికార్డ్ చేసి టిక్ టాక్‌లో పోస్ట్ చేయడం సర్వ సాధారణమైపోయింది. కొందరు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించి బాగుపడుతుంటే.. మరికొందరు మాత్రం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. టిక్ టాక్‌లో లైక్స్, కామెంట్స్ కోసం దేనికైనా తెగిస్తున్నారు యువత. వెరైటీ కాన్సెప్ట్స్, రిస్కీ ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి జైలు పాలవుతున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై గన్ పట్టుకుని తిరిగిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మారణాయుధాలతో పబ్లిక్ ప్లేస్‌లో స్టంట్స్ చేయడం పోలీసుల దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఏదో సరదా కోసం చేసిన వీడియో ఇప్పుడు వారి జీవితాలనే మార్చివేసింది. తుపాకుల వంటి మారణాయుధాలతో తిరగడం చట్టరిత్యా నేరం. ఐతే ఈ విషయంలో పట్టణాలు, నగర ప్రాంత ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ.. మారు మూల పల్లెప్రజలకు అంతగా అవగాహన లేదు. తుపాకులతో వీడియోలు చేయడం నేరమని సంగతి వారికి తెలియదు. ఇలానే ఎంతో మంది అమాయకులు టిక్ టాక్‌ లైకుల కోసం తెలిసో.. తెలియక.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇలాంటి మన దేశంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సెల్ఫీలు, టిక్ టాక్ వీడియోల కోసం రిస్కీ ఫీట్స్ చేసిన చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రైలుపైకి ఎక్కి వీడియో తీస్తున్న క్రమంలో హైటెన్షన్ విద్యుత్ లైన్‌లు తగిలి యువకులు మరణించిన వార్తలను మనం చాలానే చూశాం. అంతేకాలు టిక్ టాక్ మాయలో పడి చిన్నపిల్లలను పట్టించుకోని తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఇక పొద్దంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. చూస్తూ గడిపే గృహిణులు చాలా మందే ఉన్నారు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఎన్నో..!

సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సైతం డ్యూటీ సమయంలో టిక్ టాక్ చేస్తూ చాలా సార్లు చిక్కారు. కొందరు పోలీసులు ఖాకీ యూనిఫాంలోనే వీడియోలు చిత్రీకరించి సస్పెండ్ అయిన ఘటన చాలానే జరిగాయి. వీటిన్నింటికి తోడు అశ్లీలత, అసభ్యతను టిక్ టాక్ ప్రోత్సహిస్తోందని.. అలాంటి వీడియోలు చిన్న పిల్లలు, యువత ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పలు ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. టిక్ టాక్‌ను నిషేధించాలంటూ ఇప్పటికే పలు నగరాల్లోని కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. భారతీయ చట్టాలకు లోబడి యాప్‌ను నిర్వహించాలన టిక్‌టాక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు