• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • YOUR VEHICLE RC COULD BE SEIZED FROM NEXT YEAR FOR NOT HAVING VALID PUC CERTIFICATE NS GH

మీ వాహనానికి ఈ సర్టిఫికెట్ లేకుంటే ఆర్సీ స్వాధీనం.. కేంద్రం కొత్త రూల్.. ఎప్పటి నుంచి అమలంటే?

మీ వాహనానికి ఈ సర్టిఫికెట్ లేకుంటే ఆర్సీ స్వాధీనం.. కేంద్రం కొత్త రూల్.. ఎప్పటి నుంచి అమలంటే?

ప్రతీకాత్మక చిత్రం

PUC Certificate: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అన్ని వాహనాలకు యూనిఫార్మ్ పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. దీనిలో భాగంగా మంత్రిత్వ శాఖ త్వరలో వాహనాల వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్లను, యూనిఫార్మ్ పియుసి సర్టిఫికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.

  • Share this:
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు అన్ని వాహనాలకు యూనిఫార్మ్ పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. దీనిలో భాగంగా మంత్రిత్వ శాఖ త్వరలో వాహనాల వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్లను, యూనిఫార్మ్ పియుసి సర్టిఫికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్యూఆర్ కోడ్లలో వాహన యజమాని, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, పొల్యూషన్ స్టేటస్ వంటి ముఖ్యమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కాగా, నూతనంగా అమలు చేయనున్న ఈ చట్టంతో కాలుష్య ప్రమాణాలను ఉల్లంఘించిన వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకోబోతుంది. ప్రస్తుతం ఉన్న రవాణా వాహనాల నియమ నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ ను కలిగి ఉండటం తప్పని సరి కాదు. దీంతో చాలా మంది ప్రజలు తమ వాహన పత్రాలను తీసుకోకపోవడం, తమ పీయూసీ సర్టిఫికెట్‌ లేదా ఇన్సూరెన్స్ ను పునరుద్ధరించడం చేయట్లేదు.

ఈ సమస్యలను నూతనంగా ప్రవేశపెట్టబోయే చట్టంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. 2021 జనవరి నుంచి నిబంధనలను కఠినతరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నవంబర్ 27న ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పియుసి సిస్టమ్ ను ఆన్లైన్లో ఉంచే ముందు సలహాలను కోరుతోంది. ఈ ప్రక్రియకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది. 2021 జనవరి నుంచి కొత్త నోటిఫికేషన్ అమల్లోకి వస్తే, వాహనాల పియుసి సర్టిఫికెట్‌ను నిర్దిష్ట వ్యవధిలో పునరుద్ధరించడం తప్పనిసరి అవుతుంది.

2021 జనవరి నుంచి తప్పనిసరి..
పీయూసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించడానికి వాహన యజమానికి ఏడు రోజుల వ్యవధి ఇవ్వబడుతుంది. ఈ ఏడు రోజుల్లో అతడు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైతే అప్పుడు అతడి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) జప్తు చేయబడుతుంది. కొత్త వ్యవస్థలో, వాహన యజమానికి సంబంధించిన సమాచారం ఆటోమోటివ్ డేటాబేస్ సర్వర్లకు లింక్ చేయబడ్డ సర్వర్లకు అప్లోడ్ చేయబడుతుంది. దీంతో పీయూసీ సర్టిఫికెట్ లేకుండా ప్రజలు తమ వాహనాలను ఉపయోగించడం కష్టతరం అవుతుంది.

సర్వర్ అప్డేట్ సమయంలో వాహన యజమాని వారి మొబైల్ నంబర్లను అందించాల్సి ఉంటుంది. దీనికి వారు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP)ను అందుకుంటారు. వాహన యజమాని OTP ను అందించిన తర్వాత మాత్రమే PUC కేంద్రంలోని సిబ్బంది అతని ఫారమ్‌ను రూపొందించగలరు. అలాగే, వాహనం యజమాని పొగతో కూడిన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్నట్లు తేలితే వారి వాహనాలను మళ్లీ పరీక్షించమని కోరవచ్చు. ఈ సమస్యను సరిదిద్దుకోవడానికి వారికి ఏడు రోజుల సమయం ఇవ్వబడుతుంది. కమర్షియల్ వెహికిల్స్ కు కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు