హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agnipath: అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్.. ఎవరు అర్హులు? జీతం ఎంత? పూర్తి వివరాలు

Agnipath: అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్.. ఎవరు అర్హులు? జీతం ఎంత? పూర్తి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Agnipath Defence Recruitment Scheme: దేశంలోని యువత కోసం మంగళవారం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్(Agnipath) రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ప్రకటించారు. మరి ఎన్నిఉద్యోగాలు ఇస్తారు? ఎవరు అర్హులు? జీతమెంత? ఆ వివరాలను ఇక్కడ చూద్దాం.

ఇంకా చదవండి ...

Agnipath: దేశంలోని యువత కోసం మంగళవారం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnatha Singh) అగ్నిపథ్(Agnipath) రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ప్రకటించారు. త్రివిధ దళాల అధిపతులు.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే (Manoj Pande), ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి (VR Chaudhari), నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌(R. Hari Kumar)తో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం భారతీయ యువతకు సాయుధ బలగాల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ఆమోదించడానికి భద్రతపై కేబినెట్ కమిటీ ఈ రోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, దీని కింద భారతీయ యువత సాయుధ సేవల్లోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అగ్నిపథ్ పథకం కింద, భారతీయ యువకులకు 'అగ్నివీర్'గా సాయుధ దళాలలో సేవలందించే అవకాశం కల్పిస్తారు. భారతదేశ భద్రతను పటిష్టం చేయడానికి అగ్నిపథ్ పథకం తీసుకొచ్చారు.

India's First Private Train : పట్టాలెక్కిన దేశపు తొలి ప్రైవేట్ రైలు..ఎక్కడి నుంచి ఎక్కడికి

ఈ పథకం గురించి మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మాట్లాడుతూ..‘ఆల్-ఇండియా మెరిట్ బేస్డ్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌పై ఆధారపడి అగ్నిపథ్ మోడల్ ఉంటుంది. 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల వారితో సాయుధ దళాలకు అత్యుత్తమ సేవలను అందించాలని చూస్తున్నాం. ఒకసారి ఎంపిక అయిన అగ్నివీర్‌లు నాలుగు సంవత్సరాలు సేవలందిస్తారు’ అని చెప్పారు.

* సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకం

ఈ పథకం ప్రకారం, నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అగ్నివీర్‌లు వన్-టైమ్ 'సేవానిధి' ప్యాకేజీని అందుకుంటారు. దీనికి ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. సాయుధ దళాలలో సాధారణ కేడర్‌గా ఎంపికైన వ్యక్తులు కనీసం 15 సంవత్సరాల పాటు తదుపరి ఎంగేజ్‌మెంట్‌ పీరియడ్‌ సేవలు అందించాల్సి ఉంటుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

'అగ్నిపథ్' పథకం కింద, సాయుధ దళాల యువత ప్రొఫైల్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సింగ్ చెప్పారు. కొత్త టెక్నాలజీల కోసం వారికి శిక్షణ ఇవ్వడానికి, వారి ఆరోగ్య స్థాయిలను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా వివిధ రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

Air Pollution : భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు కట్..ఢిల్లీలో ఉండేవాళ్లకైతే 10 ఏళ్లు

* అగ్నిపథ్ పథకానికి స్వాగతం పలికిన ఆర్మీ, నేవీ IAF

ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ..‘అగ్నిపథ్ పథకం యువతకు సైన్యంలోని అనుభవానికి మధ్య వారధిలా ఉంటుంది. పటిష్టమైన మూల్యాంకన వ్యవస్థ ఆధారంగా స్క్రీనింగ్, ఎంపిక ప్రక్రియ జరుగుతాయి. దీంతో ఆర్మీకి ఎక్కువ కాలం పాటు ఉత్తమమైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఈ సిబ్బంది సంస్థ ప్రధాన కేంద్రంగా ఉంటారు.’ అని చెప్పారు.

జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..ఇవే చివరి సమావేశాలు కూడా!

'అగ్నివీర్స్'ను చేర్చడంలో, వారిని యుద్ధానికి సిద్ధం చేయడంలో IAF పాత్రను వివరిస్తూ, ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి మాట్లాడారు. IAF విమానయానం, ఆయుధాలు, అధునాతన గ్రౌండ్ సిస్టమ్‌లలో 'అగ్నివీర్స్'కి విస్తృత శిక్షణ అందిస్తామని చెప్పారు. అగ్నిపథ్ పథకం ద్వారా 'అగ్నివీర్స్' పాత్రలో యువకుల ఆప్టిట్యూడ్, దృక్పథం రెండింటినీ అంచనా వేయడానికి IAF వీలు కల్పిస్తుందని, IAFకి అవసరమైన ఏవియేషన్, నాన్-ఏవియేషన్ నైపుణ్యాలలో మరింత ప్రత్యేక శిక్షణ కోసం వారిని సిద్ధం చేస్తుందని చౌదరి చెప్పారు. ఈ పథకాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్వాగతించారు. ఇది కొత్త కాలానికి కొత్త ఆలోచన, భారతదేశం కోసం రూపొందించిన పథకమని చెప్పారు. సాయుధ దళాల మానవ వనరుల నిర్వహణపై సానుకూల ప్రభావం చూపే ఆలోచన అని ఆయన చెప్పారు.

First published:

Tags: Defence, Defence Ministry, Indian Army, Rajnath Singh

ఉత్తమ కథలు