నమ్మి అతడ్ని ప్రేమించిన పాపానికి ఓ యువతి గత 72గంటలుగా అతని ఇంటి ముందు నిరవధిక దీక్ష చేస్తోంది. తనను ప్రేమిస్తున్నానని చెప్పి నాలుగేళ్లుగా తన వెంట తిరిగిన యువకుడు పెళ్లి పేరు ఎత్తగానే మాయమైపోయాడు. ప్రేమ(Love)పేరుతో మోసపోయిన యువతి ఎలాగైనా ప్రేమించిన వాడ్నే పెళ్లాడతానంటూ ప్రాణత్యాగానికి సైతం సిద్ద పడింది. జార్ఖాండ్(Jharkhand)లోని ధన్‌బాద్ (Dhanbad)జిల్లాలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు సైతం ఆ యువతి చేస్తున్న పోరాటానికి అండగా నిలిచారు.
మోసం చేసిన ప్రేమికుడు..
ధన్‌బాద్ జిల్లాలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఉత్తమ్ మహా అనే యువకుడ్ని ధర్జోరికి చెందిన యువతి ప్రేమించింది. ఇద్దరూ ఎస్ఎస్ఎల్‌ఎన్‌టీ కాలేజీలో చదువుతున్నారు. అదే సమయంలో ఇద్దరికి పరిచయమైంది. అది కాస్తా స్నేహంగా మారి చివరకు ప్రేమకు దారి తీసింది. నాలుగేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ రెండు కుటుంబాలకు తెలుసు. అయితే ఉత్తమ్ మహాను పెళ్లి చేసుకోమని యువతి కోరింది. దాంతో అతని ఇల్లు వదిలి పారిపోయాడు. ప్రియుడు మోసం చేయడంతో అతనితో పెళ్లి జరిపించమని అతని ఇంటి ముందు బాధితురాలు ధర్నా చేస్తోంది. ఒ గత 72గంటలుగా నిరవధిక దీక్ష చేస్తోంది.
ప్రేమ పెళ్లి కోసం ధర్నా..
ప్రేమ పేరుతో మోసపోయిన యువతి చేస్తున్న న్యాయపోరాటానికి ఆమె అమ్మమ్మ, కన్నతండ్రి కూడా నిరవధిక దీక్ష చేస్తున్నారు. రెండ్రోజులకుపైగా యువతి దీక్ష చేస్తుండటంతో స్థానికులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉత్తమ్ మహా ఆచూకి దొరకగానే పెళ్లి చేస్తామని మాటిచ్చినప్పటికి యువతి దీక్ష వదలడం లేదు. ప్రియుడితో తనకు వివాహం జరిపించే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పింది.
మోహం చాటేసిన ప్రియుడు..
ముందు పెళ్లికి ఒప్పుకున్న ప్రియుడు...తర్వాత ముఖం చాటేశాడని ..ఇందులో అతని తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని యువతి ఆరోపించింది.ఎన్ని రోజులైనా ఉత్తమ్ మహాతో పెళ్లి జరిగిన తర్వాతే తన నిరవధిక దీక్ష విరమిస్తానంటోంది. ఎక్కడున్నా తన ప్రియుడ్ని వెదికి తెచ్చి తనతో వివాహం జరిపించి న్యాయం చేయాలని కోరుతోంది.అప్పటి వరకు తన దీక్ష కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jarkhand, Love cheating, Viral Video