Home /News /national /

YOUNG BOY DIES DANCING AT FRIENDS WEDDING DOCTOR CLAIMS LOUD DJ MUSIC PROVED FATAL IN MADHYA PRADESH MKS

Wedding: డీజే సౌండు దెబ్బకు గుండె ఆగింది.. పెళ్లివేడుకలో డాన్స్ చేస్తూ యువకుడు హఠాన్మరణం

మృతుడు లాల్ సింగ్(18)

మృతుడు లాల్ సింగ్(18)

ప్రతి ఈవెంట్ లోనూ డీజే సౌండ్లు మోగిపోతున్న క్రమంలో దాని దుష్పరిణామాలు వరుగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ డీజే సౌడ్ ధాటికి గుండె ఆగి యువకులు చనిపోతున్న ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా ఘటనలో18 ఏళ్ల యువకుడు బలయ్యాడు. వివరాలివే..

ఇంకా చదవండి ...
పెళ్లి వేడుకల నుంచి పొలిటికల్ పార్టీల మీటింగ్స్ దాకా ప్రతి ఈవెంట్ లోనూ డీజే సౌండ్లు మోగిపోతున్న క్రమంలో దాని దుష్పరిణామాలు వరుగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ డీజే సౌడ్ ధాటికి గుండె ఆగి యువకులు చనిపోతున్న ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 18 ఏళ్ల మరో యువకుడు డీజే సౌండుకు బలైపోయాడు. వివరాలివి..

ఉజ్జయిని జిల్లాలోని అంబోడియా ఊరికి చెందిన లాల్ సింగ్(18) అనే యువకుడు సమీపంలోని తాజ్‌పూర్ వెళ్లి తన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత కొత్త జంటను అత్తారింటికి పంపే క్రమంలో ఊళ్లో బారాత్ తీశారు. స్నేహితులతో కలిసి లాల్ కూడా బారాత్‌లో జోరుగా డ్యాన్స్ చేశఆడు. డీజే బాక్సుల వెనుక చిందులు వేస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారు.

TRS-BJP పొత్తు గుట్టు రట్టు.. ప్రశాంత్ కిషోర్ రిపోర్టుతో ఇలా -ఆ మాటలకు KTR సిగ్గుపడాలి: సీతక్క


తాను డీజే సౌండ్ బాక్సు ముందు పాటకు స్టెప్పు వేస్తానని, తన డాన్స్ వీడియో తీయాల్సిందిగా స్నేహితుడికి ఫోన్ ఇచ్చి లాల్ సౌండ్ బాక్సుల ముందుకు వెళ్లాడు. డీజే చప్పుళ్లు, సంబురాల మధ్యనే లాల్ సింగ్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక అక్కడున్నవారంతా కంగారుపడ్డారు. ఎంత కదిపినా చలనం లేకపోవడంతో లాల్ ను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడే తేదీ ఇదే..


ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే లాల్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడని డాకర్లు నిర్ధారించారు. అసలు ఎలా చనిపోయాడో నిర్ధారించుకోడానికి డాక్టర్లు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ 18 ఏళ్ల ఆ యువకుడి గుండెలో రక్తం గడ్డకట్టినట్టు పోస్టుమార్టం తేలిందని ఉజ్జయిన్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు జితేంద్ర శర్మ చెప్పారు. పెళ్లి బారాత్‌లో డీజే బాక్సుల నుంచి విడుదలైన భారీ శబ్దాల కారణంగానే లాల్ గుండెలో రక్తం గడ్డకట్టిందని ఆయన చెబుతున్నారు.

CM KCR భవితవ్యంపై గురువు Chandrababu అంచనా? -అదే జరిగితే ఎంత డబ్బున్నా పనికిరాదంటూ..


డీజే ద్వారా లేదా ఇతర దేని ద్వారానైనా భారీ స్థాయిలో మ్యూజిక్ ప్లే చేస్తే అది మన బాడీలో అసాధారణ ఫిజియలాజికల్ రియాక్షన్స్‌ను ప్రేరేపిస్తుందని డాక్టర్ శర్మ అన్నారు. శ్రుతి మించిన డెసిబిల్స్ సౌండ్ల ద్వారా మనిషికి ముప్పేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ భారీ శబ్దాల కారణంగా గుండె, మెదడు వంటి అంతర్గత అవయవాలు దెబ్బతినవచ్చునని డాక్టర్ శర్మ వివరించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Madhya pradesh, Music, Sound, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు