హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

World Youth Skills Day: యువతలో సరైన నైపుణ్యాలు లేవు.. సర్వేలో నమ్మలేని నిజాలు.. ఇది చదివితే అవాక్కు అవ్వాల్సిందే!

World Youth Skills Day: యువతలో సరైన నైపుణ్యాలు లేవు.. సర్వేలో నమ్మలేని నిజాలు.. ఇది చదివితే అవాక్కు అవ్వాల్సిందే!

యువతలో సరైన నైపుణ్యాలు లేవంటూ నమ్మలేని నిజాలు చెప్పిన సర్వే.. ఎంత మంది లో లేవంటే .. చదివితే షాక్ అవుతారు!
(image: Shutterstock)

యువతలో సరైన నైపుణ్యాలు లేవంటూ నమ్మలేని నిజాలు చెప్పిన సర్వే.. ఎంత మంది లో లేవంటే .. చదివితే షాక్ అవుతారు! (image: Shutterstock)

ఎడ్‌ టెక్ కంపెనీ ఉడెమీ (Udemy) చేపట్టిన సర్వే ప్రకారం.. టాప్ స్కిల్స్‌లో Microsoft SC-200, డైనమిక్ ప్రోగ్రామింగ్, మైక్రోసాఫ్ట్ ప్లేరైట్ ఉన్నాయి. విద్యార్థులు చదువుతున్న కాలేజీలు నేటి జాబ్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన స్కిల్స్(Skills) (నైపుణ్యాలను) నేర్పించట్లేదని సర్వేల

ఇంకా చదవండి ...

ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీ(Technology)కి విద్యార్థులు, నిపుణులు అలవాటు పడాలి. కొత్త తరం స్కిల్స్‌ యూత్‌కు కెరీర్ ఆప్షన్‌గా మారుతున్నాయి. అందుకే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెక్నికల్ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. అయితే కాలేజీల్లో విద్యార్థులకు స్కిల్స్(Skill) ఏమేరకు ఉపయోగపడుతున్నాయనే విషయం చేపట్టిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆన్‌లైన్ కోర్స్ ప్రొవైడర్, ఎడ్‌ టెక్ కంపెనీ ఉడెమీ (Udemy) చేపట్టిన సర్వే ప్రకారం.. టాప్ స్కిల్స్‌లో Microsoft SC-200, డైనమిక్ ప్రోగ్రామింగ్, మైక్రోసాఫ్ట్ ప్లేరైట్ ఉన్నాయి. విద్యార్థులు చదువుతున్న కాలేజీలు నేటి జాబ్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన స్కిల్స్ (నైపుణ్యాలను) నేర్పించట్లేదని సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

నైపుణ్యాలు చాలా వేగంగా మారుతున్నాయని, ఫలితంగా తమ ప్రస్తుత నాలెడ్జ్ వాడుకలో లేకుండా పోతుందని 84 శాతం మంది చెప్పారు. తమ ఎంప్లాయర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్‌ అందిస్తున్నారని 86 శాతం మంది తెలిపారు. కంపెనీ సంబంధిత స్కిల్ డెవలప్‌మెంట్‌ అందించకపోతే తమ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేస్తామని 61 శాతం మంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 15న) వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా మన దేశంలో టాప్ స్కిల్స్ ఏవో తెలుసుకుందాం.

ఇదీ చదవండి:  Punjab Schools: తెలుగు భాషకు అరుదైన గౌరవం.. ఆ రాష్ట్రంలో బోధించాలని నిర్ణయం.. తలలు పట్టుకుంటున్న టీచర్లు!


2022 ఏప్రిల్- జూన్ మధ్య ఇండియాలో పెరుగుతున్న టాప్ స్కిల్స్ ఇవే..

Microsoft SC-200- 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే వినియోగంలో 479% పెరుగుదల

డైనమిక్ ప్రోగ్రామింగ్ - 235%

మైక్రోసాఫ్ట్ ప్లేరైట్ - 231%

PCB డిజైన్ - 214%

PCI DSS - 196%

SAP PP - 184%

డేటాడాగ్ - 141%

బిజినెస్ ఇటిక్వ్ట్ (Business Etiquette) - 129%

AWS యాంప్లిఫై - 124%

యోక్టో ప్రాజెక్ట్ - 122%

గత కొన్ని సంవత్సరాలుగా టెక్నికల్ లేదా డిజిటల్(Digital) స్కిల్ బాగా పెరిగాయి. “నేటి వర్క్‌ప్లేస్‌లలో డిజిటల్ స్కిల్స్‌కు మంచి డిమాండ్ ఉంది, ఇది కొనసాగుతుంది. డిజిటల్ స్కిల్ అనేవి వ్యక్తులు సమర్థవంతమైన ఉద్యోగులుగా ఉండటం నుంచి లీడర్‌గా ఎదగడం వరకు సహాయం చేస్తాయి" అని వెబ్ డొమైన్ కంపెనీ GoDaddy పేర్కొంది. వర్క్‌ప్లేస్‌లో అత్యంత డిమాండ్ ఉన్న డిజిటల్ స్కిల్స్‌లో వెబ్‌సైట్ మేనేజింగ్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, డేటా ఎనలిటిక్స్, అఫిలియేట్ మార్కెటింగ్ వంటివి ఉన్నాయి.

ఈ సంవత్సరం అత్యంత డిమాండ్ ఉన్న జాబ్ రోల్స్‌లో ఒకటి డేటా అనలిటిక్స్ అని చెబుతోంది వధాని (Wadhani) ఫౌండేషన్. 96 శాతం కంపెనీలు విభాగంలో నియామకాలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, డేటా కలెక్షన్ అండ్ క్లీనింగ్, డేటా విజువలైజేషన్, డేటా రిసెర్చ్, మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ స్కిల్స్ వంటివి ఉన్నాయి. డిమాండ్ ఉన్న ఇతర ఉద్యోగాలలో డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేట్ సైన్స్ వంటివి ఉన్నాయని వధాని ఫౌండేషన్ పేర్కొంది.

Published by:Mahesh
First published:

Tags: Communications, Skills, Survey, Youth

ఉత్తమ కథలు