ఆధార్ విషయంలో ఇలా చేస్తే రూ.10వేల ఫైన్

ఆధార్ నెంబర్‌ను తప్పుగా ఇస్తే వారిపై రూ.10వేల జరిమానా విధిస్తుంది. దీనికి సంబంధించి చట్టాల్లో మార్పులు తేవాలని కేంద్రం భావిస్తోంది.

news18-telugu
Updated: July 15, 2019, 3:24 AM IST
ఆధార్ విషయంలో ఇలా చేస్తే రూ.10వేల ఫైన్
ఆధార్ కార్డు
  • Share this:
పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్‌ను వాడుకోవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. అయితే, దీన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గుర్తించింది. ఆ రకంగా తప్పుడు ఆధార్ నంబర్ ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఆధార్ నెంబర్‌ను తప్పుగా ఇస్తే వారిపై రూ.10వేల జరిమానా విధిస్తుంది. దీనికి సంబంధించి చట్టాల్లో మార్పులు తేవాలని కేంద్రం భావిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్‌ను అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ఆలోచన. ప్రస్తుతం భారత్‌లో 22 కోట్ల పాన్ కార్డుల వివరాలు ఆధార్ కార్డుతో అనుబంధం అయి ఉన్నాయి. అలాగే, 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. దీంతోపాటు రేషన్ కార్డుకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేయాలనే ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉన్నట్టు తెలిసింది. 2020 జూన్ 30 నాటికి రేషన్ కార్డు పోర్టబిలిటి (మొబైల్ పోర్టబిలిటీ తరహాలో) అమలు చేయడంతోపాటు ఆధార్ కార్డును కూడా దానికి అనుసంధానం చేసే ప్లాన్‌లో ఉంది. రేషన్ కార్డుకు ఆధార్‌ను లింక్ చేస్తే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందనేది కేంద్రం అభిప్రాయం.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>