హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Narendra Modi: చిన్నారి చిట్టిపొట్టి మాటలకు మోదీ ఫిదా.. బాలిక చెప్పిన సమాధానానికి ఒకటే నవ్వు.. ఇంతకీ ఆ పాప ఎవరంటే..?

Narendra Modi: చిన్నారి చిట్టిపొట్టి మాటలకు మోదీ ఫిదా.. బాలిక చెప్పిన సమాధానానికి ఒకటే నవ్వు.. ఇంతకీ ఆ పాప ఎవరంటే..?

చిన్నారితో మాట్లాడుతున్న మోదీ

చిన్నారితో మాట్లాడుతున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ బీజేపీ ఎంపీ (BJP MP) కూతురితో కాసేపు ముచ్చటించారు. ఆ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో మోదీని బాగా నవ్వించేసింది. ఆ 5 ఏళ్ల బాలికతో కాసేపు ముచ్చటించిన మోదీ తానెవరో తెలుసా? తానేం చేస్తానో తెలుసా? అని ప్రశ్నించారు. అందుకు ఆ బాలిక చెప్పిన సమాధానాలతో మోదీ మురిసిపోయారు.

ఇంకా చదవండి ...

భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ(Modi)కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే వారితో మాట్లాడేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. ఆ పిల్లలకు బహుమతులు ఇచ్చి సంతోష పెట్టడంతో పాటు ఆశీర్వదిస్తారు. తాజాగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ బీజేపీ ఎంపీ (BJP MP) కూతురితో కాసేపు ముచ్చటించారు. ఆ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో మోదీని బాగా నవ్వింపచేసింది. ఆ 5 ఏళ్ల బాలికతో కాసేపు ముచ్చటించిన మోదీ తానెవరో తెలుసా? తానేం చేస్తానో తెలుసా? అని ప్రశ్నించారు. అందుకు ఆ బాలిక చెప్పిన ఒక సమాధానం విని ఆయన చిరునవ్వులు చిందించారు.

మధ్యప్రదేశ్‌(Madhya pradesh)లోని ఉజ్జయినీకి చెందిన బీజేపీ ఎంపీ ఫిరోజియా బుధవారం రోజు తన కుటుంబంతో కలిసి పార్లమెంట్‌లో ప్రధానిని కలిశారు. తన చిన్న అమ్మాయి అహానా (Ahana), పెద్ద అమ్మాయి ప్రియాంషి కూడా ఫిరోజియా తీసుకొచ్చారు. అయితే మోదీ ఎంపీ చిన్న కుమార్తె అహానాని చూసి ముగ్ధులయ్యారు. ఆ తర్వాత ఆ బాలికను తన దగ్గరికి పిలిపించుకున్నారు. అప్పుడు వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ ఈ కింద విధంగా సాగింది. పీఎం ఆ చిన్నారిని తన దగ్గరికి పిలిపించుకొని "నేనెవరో తెలుసా" అని ప్రశ్నించారు. "హా, తెలుసు, మీరు మోదీ జీ. మీరు ప్రతిరోజూ టీవీలో కనిపిస్తారు" అని ఆ బాలిక బదులిచ్చింది. "నేనేం చేస్తానో తెలుసా’’ అని మోదీ ఇంకొక ప్రశ్న వేశారు. అప్పుడు ఆ బాలిక బదులిస్తూ "మీరు లోక్‌సభలో పని చేస్తారు" అని సమాధానం చెప్పింది. ఆ మాటలు వినగానే ఆ బాలిక అమాయకత్వానికి మోదీ గట్టిగా నవ్వేశారు. ఇది విని గదిలో ఉన్న అందరూ కూడా విరగబడి నవ్వారు. అలా మనసారా నవ్వుకున్న తర్వాత ప్రధాని మోదీ గది నుంచి బయటకు పంపించే ముందు బాలికకు చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చారు.


ఇదీ చదవండి: Russia-China: అమెరికాకు చెక్ పెట్టనున్నరష్యా- చైనా.. వార్ గేమ్స్ తో భారీ ప్రదర్శనకు శ్రీకారం


అనిల్ ఫిరోజియా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విసిరిన ఒక సవాలును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మీరు ఎన్ని కిలోల బరువు తగ్గితే అన్ని రూ.వేల కోట్లు మీ నియోజకవర్గానికి ఇస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. దాంతో ఎంపీ యోగా, ఎక్సర్‌సైజులు చేసి 21 కిలోల బరువు తగ్గి ఆశ్చర్య పరిచారు. ఇప్పుడు కేంద్రం తన నియోజకవర్గానికి రూ.21,000 కోట్లు ఇస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రధాని కూడా ఎంపీ బరువు తగ్గడం చాలా గొప్ప విషయం అని అభినందించారు. అతని ప్రయత్నాలను మెచ్చుకున్న మోదీ, ఫిట్‌గా ఉండేందుకు ఇంకాస్త బరువు తగ్గాలని ఓ సూచన చేశారు. బరువు తగ్గాలని ఈ నెలలోనే ఇంకొక రాజకీయ నేతను కూడా మోదీ సూచించారు. జులై 12న బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (32) “బరువు తగ్గండి" అని సూచించారు. దాంతో అతను క్రికెట్ ఆడుతూ, తన చేతులతో కారుని లాగుతూ బాగా కష్ట పడుతున్నారు.

"ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు కలిసిన ఈరోజు మరిచిపోలేనిది. మా కుటుంబ సభ్యులందరూ ఆయన ఆశీస్సులను అందుకున్నాం. తన జీవితం మొత్తం దేశ సేవకే అంకితం చేసిన మోదీ నిజాయితీగా, నిస్వార్థంగా, త్యాగశీలిలా చాలా కష్టపడుతున్నారు. నరేంద్ర మోదీ సమక్షంలో నాకు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. పీఎంని నేరుగా కలుసుకుని ఆయన ప్రేమను పొందడం పట్ల నా ఇద్దరు కూతుర్లు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు." అని ఎంపీ ఫిరోజియా ఫొటోలతో సహా వరుస ట్వీట్లు చేశారు.

First published:

Tags: Bjp, Lok sabha, Madhya pradesh, Pm modi

ఉత్తమ కథలు