అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారు... తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ హాసన్

Kamal Haasan : అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారని చరిత్ర చెబుతోందన్న కమల్ హాసన్... తన వ్యాఖ్యలు... శాంతి, సౌభ్రాతృత్వాలను పెంచేందుకే అన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 9:35 AM IST
అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారు... తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కమల్ హాసన్
కమల్ హాసన్ (File Image)
  • Share this:
దేశంలో గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. గురువారం ఓ బహిరంగ సభలో ఆయనపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా తాను బెదిరేది లేదన్నారు కమల్ హాసన్. రాళ్లు విసిరిన ఇద్దర్నీ కమల్ హాసన్ అభిమానులు చితకబాదబోతుంటే... అడ్డుకున్న పోలీసులు వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. రాజకీయాల్లో క్వాలిటీ తగ్గిపోతోందన్న కమల్ హాసన్... ఆ బురదలో తాను కొట్టుకుపోదలచుకోలేదని అన్నారు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారని చరిత్ర చెబుతోందన్న కమల్ హాసన్... తన వ్యాఖ్యలు... శాంతి, సౌభ్రాతృత్వాలను పెంచేందుకే అన్నారు. తాను ముస్లింలు, క్రైస్తవులు, హిందువులకు చేరువవుతున్నానని తెలిపారు.

తనపై బ్యాన్ వెయ్యడం న్యాయం కాదన్న కమల్ హాసన్... ఇదివరకు కూడా గాడ్సేపై ఇదే అభిప్రాయాన్ని చెప్పానన్నారు. ఈసారి మాత్రమే తన వ్యాఖ్యలు దుమారం రేపాయన్నారు. ప్రధానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్న కమల్ హాసన్... చరిత్రే ఆయనకు సమాధానం అవుతుందన్నారు. తనను అరెస్టు చేస్తారన్న భయం తనకు లేదన్న కమల్... తనపై జరుగుతున్న కుట్రల వెనక ప్రభుత్వ హస్తం ఉండి ఉండొచ్చనీ, అందుకే ఇవాళ సులూర్‌లో జరపాలనుకున్న సభకు అనుమతి రద్దు చేశారని విమర్శించారు.

 

ఇవి కూడా చదవండి :పాకిస్థాన్ యువతి ఉచ్చులో భారత జవాన్‌... కొంపముంచిందిగా...

ఎల్ఈడీ బల్బులతో ప్రమాదం... కళ్లుపోతాయ్..!!

బెంగాల్‌లో బీజేపీ వ్యూహం ఫలిస్తోందా... మమతాబెనర్జీకి షాక్ తప్పదా..?100+18 ఇదీ వైసీపీ లెక్క... జగన్ చేయించిన 5 సర్వేల్లో తేలిందేంటి..?
First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>