• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • YOGI ADITYANATH GOVERNMENT OF UP HAS GIVEN A HUGE RELIEF BY ORDERING 28 DAY PAID LEAVE TO EMPLOYEES WHO HAVE TESTED COVID19 POSITIVE SSR GH

Paid leave: కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Paid leave: కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. రెండో దశలో రోజుకు సుమారు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించినా వైరస్ వ్యాప్తి కట్టడి కావట్లేదు. దీంతో విధుల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం...

  • Share this:




దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. రెండో దశలో రోజుకు సుమారు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించినా వైరస్ వ్యాప్తి కట్టడి కావట్లేదు. దీంతో విధుల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. మహమ్మారి బారిన పడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు 28 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత ఏడాది కూడా ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19 మహమ్మారి ఇలాగే విజృంభించింది. దీంతో అప్పట్లో కూడా కరోనా సోకిన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించారు.

అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు తమ కోవిడ్ పాజిటివ్ ఉద్యోగులకు 28 రోజుల వేతన సెలవులు మంజూరు చేయాలని అధికారిక నివేదిక పేర్కొంది. పది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కోవిడ్-19 హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ నిర్దారణ అయిన ఉద్యోగులు సంబంధిత విభాగాలకు తెలియజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసివేసిన ఫ్యాక్టరీల్లోని ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

* రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా
ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. రెండో దశలో రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించే అవకాశాలు లేవని ప్రభుత్వం తెలిపింది. వారాంతపు లాక్‌డౌన్‌ల సమయంలో ఫ్యాక్టరీలు తెరిచి ఉంచటానికి కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం విశేషం. ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు వారి జీవనోపాధికి కూడా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేశ్ శర్మ తెలిపారు. లాక్‌డౌన్‌లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌పై ఆలోచించట్లేదని ఆయన వివరించారు.



Published by:Sambasiva Reddy
First published:

అగ్ర కథనాలు