రాముడు ముస్లింలకూ ఆరాధ్యుడే: బాబా రాందేవ్

బాబా రామ్‌దేవ్

ప్రపంచంలోనే అత్యంత సుందర కట్టడంగా, భారతీయుల కలలు సాకారం చేసే రీతిలో మందిర నిర్మాణం జరగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని బాబా రాందేవ్ అన్నారు.

  • Share this:
    రాముడు కేవలం హిందువులకు మాత్రమే కాదని, ముస్లింలకూ ఆరాధ్యుడని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. మన దేశంలో శాతం ముస్లింలు మత మార్పిడికి గురైనవారేనని ఆయన అన్నారు. ముస్లింలూ శ్రీరాముడిని గౌరవిస్తారని బాబా రాందేవ్ చెప్పుకొచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును తాను జాతీయ సమైక్యతా కోణంలో చూస్తానని స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయం హిందువుల సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఓ ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ అన్నారు.

    ప్రపంచంలోనే అత్యంత సుందర కట్టడంగా, భారతీయుల కలలు సాకారం చేసే రీతిలో మందిర నిర్మాణం జరగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. క్యాథలిక్‌లకు వాటికన్‌, ముస్లింలకు మక్కా, సిక్కులకు స్వర్ణ మందిరం ఎలాగో హిందువులకు అయోధ్య అటువంటిదని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.
    First published: