అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా అనే మాట ఒకటుంటుంది. అనవసరంగా ఏదో మాట్లాడేసి.. తర్వాత నాలుక కరచుకొని క్షమాపణలు చెబుతుంటారు ప్రముఖులు. యోగా గురువుగా వరల్డ్ ఫేమస్ అయిన బాబా రాందేవ్ విషయంలో ఇదే జరిగింది. తప్పుగా మాట్లాడి దేశ మహిళల ఆగ్రహాన్ని చూసిన రాందేవ్.. మహిళలకు క్షమాపణలు చెప్పారు. మహిళలు బట్టలు వేసుకోకపోయినా బాగుంటారు అని.. చిక్కుల్లో పడిన బాబాకి మహారాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దాంతో అరెస్టు నుంచి బయటపడేందుకు రాందేవ్.. దారికొచ్చారు. క్షమాపణ చెబుతూ.. లేఖ విడుదల చేశారు.
అసలేం జరిగింది?
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న బాబా రాందేవ్.. ఈమధ్య మరోసారి అలాగే చేశారు. పతంజలి యోగాపీఠ్ అధ్వర్యంలో.. మహారాష్ట్రలోని థానేలో జరిపిన యోగా సైన్స్ క్యాంప్‌లో పాల్గొన్న రాందేవ్.. మహిళల ముందు ప్రసంగించారు. "మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు, సల్వార్ సూట్లలో కూడా అందంగా కనిపిస్తారు. నా కళ్లకు అయితే వాళ్లు దుస్తులు ధరించకున్నా బాగుంటారు" అంటూ రామ్‌దేవ్ నవ్వారు. ఇదే తీవ్ర దుమారం రేపింది. ఆయనపై మహారాష్ట్రతోపాటూ.. దేశవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పకపోతే.. ఆయనపై కేసులు పెడతామని కొందరు వార్నింగ్ ఇచ్చారు.
రాందేవ్ ఈ మాటలు అన్నప్పుడు అదే వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, సీఎం ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. రామ్‌దేవ్ వ్యాఖ్యల్ని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ తీవ్రంగా తప్పుపట్టారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఏమాత్రమో అర్థమైందన్నారు. ఇలా ఈ డైలాగ్స్‌తో రాందేవ్‌పై యోగా గురువుగా ఉన్న గౌరవం కాస్తా పోయింది.
Atacama Desert : చెత్తకుప్పలా అటకామా ఎడారి.. పర్యావరణ వేత్తల ఆందోళన
ఇప్పుడు రాందేవ్ బాబా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడం వల్ల ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందనే భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రముఖులైన వారు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తూ.. ఇతరుల మనోభావాలకు భంగం కలిగించడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన అంశమే. సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి వారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని అందరూ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Baba Ramdev, Maharashtra