76 ఏళ్ల వయసులో పేరు మార్చుకున్న నేత.. సీఎం పదవి కోసం..

యడ్యూరప్ప (File)

కర్ణాటక బీజేపీ నేత, కాబోయే ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పేరు మార్చుకున్నారు.

 • Share this:
  కర్ణాటక బీజేపీ నేత, కాబోయే ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పేరు మార్చుకున్నారు. న్యూమరాలజీ ప్రకారం ఆయన పేరును Yeddyurappa నుంచి Yediyurappaగా మార్చుకున్నారు. తన పేరులోని D అక్షరాన్ని తొలగించి ఆ స్థానంలో Y అక్షరాన్ని చేర్చారు. అయితే, విచిత్రంగా అసలు ఆయన రాజకీయ కెరీర్ ప్రారంభించినప్పటి పేరు కూడా అదే. 1975లో షికారిపుర టౌన్ మున్సిపాలిటీ మెంబర్‌గా పోటీ చేసినప్పుడు ఆయన పేరు Yediyurappaగానే ఉండేది. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు, 2007లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన పేరు Yediyurappa గానే ఉంది. అయితే, 2007లో జేడీఎస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. కేవలం ఏడు రోజుల్లోనే పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కొందరు న్యూమరాలజిస్టుల సూచనల ప్రకారం తన పేరులో Y స్థానంలో D చేర్చారు. యడ్యూరప్ప పేరు మార్చిన తర్వాత మీడియా సర్కిల్స్‌లో ఆయన పేరును యెడ్డీగా మార్చేశారు. దీంతో యడ్యూరప్పను BSYగా పేర్కొనాలని, యెడ్డీగా వద్దంటూ ఆయన కార్యాలయం నుంచి మీడియా వారికి సమాచారం ఇచ్చారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖలో యడ్యూరప్ప పేరు మార్పు విషయం బయటకు వచ్చింది. తాజాగా రాసిన లేఖలో తన పేరును Yediyurappaగా పేర్కొన్నారు.

  అమిత్ షాకు యడ్యూరప్ప రాసిన లేఖ (ఇందులో యడ్యూరప్ప పేరు మారింది)


  దీంతోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత కార్యాలయంలో కూడా ఆయన నేమ్ బోర్డులో కూడా Yediyurappaగా పేరు మార్చారు.

  బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప నేమ్ బోర్డులో పేరు మార్చిన ఫొటో


  కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడంతో యడ్యూరప్ప నేడు మరోసారి కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.
  First published: