దేశమంతా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు విడుదలైన సినిమాకు టాక్ కూడా బాగానే వచ్చేసింది. దాంతో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళికి మరోసారి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ఆయన టేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు కొందరి నుంచి నెగిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. సినిమాకు పాజిటివ్స్ ఉన్నపుడు కచ్చితంగా నెగిటివ్స్ కూడా ఉంటాయి. వాటిని ఒప్పుకుని తీరాల్సిందే. కేవలం ప్లస్ మాత్రమే తీసుకుని.. మైనస్ పట్టించుకోనంటే అది పద్దతి కూడా కాదు.. కచ్చితంగా అన్ని పట్టించుకోవాల్సిందే. అయితే ట్రిపుల్ ఆర్ సినిమాపై వస్తున్న నెగిటివ్ రివ్యూలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
తాజాగా ఈ సినిమాపై ప్రముఖ వ్యాపార వేత్త, ఒకప్పటి నిర్మాత, ఇప్పటి వైసీపీ నేత ప్రసాద్ వి పొట్లూరి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్లపై ఈయన సీరియస్ అయ్యాడు.
జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు..
— PVP (@PrasadVPotluri) March 25, 2022
సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి..
Load,aim and shoot your views ?#BanGreatAndhra #RRRMovie #RRRreview
జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు.. సినీ ప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి..
నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు..
— PVP (@PrasadVPotluri) March 25, 2022
కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా..
Respect freedom of speech, but there is a fine line of agenda and objective views !
నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా..
కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి..
— PVP (@PrasadVPotluri) March 25, 2022
జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి ?
కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి.. జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి.. మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈయన ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. ఎవర్ని టార్గెట్ చేస్తూ పివిపి ఈ ట్వీట్స్ చేసాడు.. బయట నార్మల్‌గా రివ్యూలు రాసిన వాళ్లపైనా లేదంటే ఇండస్ట్రీలోనే కొందరిపైనా అనేది అర్థం కావడం లేదు. గతంలోనూ ఈయన మహేష్ బాబు సహా చాలా మంది స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. లంగాగాళ్లకు 50 కోట్లు ఇస్తున్నారు అంటూ స్టార్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసాడు పివిపి. ఇప్పుడు సినిమాలు చేయడం మానేసాడు ఈయన. రాజకీయాలతో పాటు తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. దాంతో తనకు అవసరం లేని ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.