తూర్పు తీరాన్ని ముంచెత్తేందుకు యాస్ తుపాను దూసుకొస్తోంది. ఒడిశా తీరానికి అతీ సమీపంలోకి చేరింది. ఈ అతి తీవ్ర తుపాను మరికొద్ది గంటల్లోనే తీరం దాటనుంది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం యాస్ తుపాను భద్రక్ జిల్లాలోని ధమ్రాకు తూర్పు దిశలో 40 కి.మీ. దూరంలో, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 90 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం ధమ్రా, బాలాసోర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో పెను గాలులు వీస్తాయని తెలిపింది. మరి ప్రస్తుతం ఏ దిశలో ముందుకెళ్తోంది? నిర్దిష్టంగా ఎక్కడ ఉందో.. లైవ్‌లో వీక్షించండి.
యాస్ తుపాన్ ప్రభావంత ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో భారీగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఒడిశాలో 52 బృందాలు, పశ్చిమ బెంగాల్‌లో 45 బృందాలు పనిచేస్తున్నాయి.
#WATCH | Odisha: Strong winds and heavy rain hit Dhamra in Bhadrak district as #CycloneYaas nears landfall.
— ANI (@ANI) May 26, 2021
IMD says that the 'very severe cyclonic storm' is expected to make landfall by noon today with wind speed of 130-140 kmph gusting up to 155 kmph. pic.twitter.com/fveRV5Xfqb
తీర ప్రాంతాల్లోని లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి భువనేశ్వర్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కోల్‌కతా నుంచి కూడా విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తుపాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు రైల్వే పరిధిలో పలు రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.