రేషన్ కార్డులో పేరు తప్పు పడడంతో ఆ వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులు కుత్తా (హిందీలో కుక్క) అని పడింది. అంతే సదరు వ్యక్తి అధికారులపై కోపం తెచ్చుకున్నాడు. దీనితో ప్రభుత్వ అధికారి ముందు తనదైన శైలిలో బౌ..బౌ అంటూ వినూత్నంగా నిరసన తెలిపాడు. అయితే ఆ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు రేషన్ కార్డులో పేరు మార్పుపై అధికారులకు విన్నవించుకున్నాడు. మూడోసారి పేరులో దుత్తా అని పడింది. ఈ క్రమంలో బాధితుడు అధికారి ముందు ఇలా కుక్కలా మొరుగుతూ నిరసన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది.
In Ration card, his surname was written as Kutta instead of Dutta, so he did this in fromt of officer ???? pic.twitter.com/B1ab7Loo3v
— Facts (@BefittingFacts) November 19, 2022
శ్రీకాంత్ కుమార్ దత్త బంకుర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాగా అతని రేషన్ కార్డులో పేరు తప్పుగా పడింది. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులుగా శ్రీకాంత్ కుమార్ కుత్తా అని పడింది. అయితే కుత్తా అంటే హిందీలో కుక్క అని అర్ధం. అయితే ఇలా తన పేరును మూడు సార్లు తప్పుగా ప్రింట్ చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి సారి నా శ్రీకాంత్ మొండల్ అని రాశారు. నేను మొండల్ కాదు దూరేయ్ సర్కార్ (ఇంటి ముందుకు ప్రభుత్వం) క్యాంప్ కు వెళ్లి అభ్యర్ధన పెట్టుకున్నాను.
ఆ తర్వాత నా పేరును శ్రీకాంతో దత్తా అయింది. దీనితో బాధితుడు మళ్లీ అధికారులను సంప్రదించాడు. మరోసారి తన పేరు తప్పుగా పడిందని దానిని మార్చాలని అప్లై చేసుకున్నారు. అయితే ఈసారి శ్రీకాంత్ కుత్తా అని పడింది. ఇది చూశాక నేను మెంటల్ గా మనోవేదనకు గురయ్యాను. మళ్ళీ దూరేయ్ సర్కార్ (ఇంటి ముందుకు ప్రభుత్వం) క్యాంప్ కు వెళ్ళాను. అక్కడి అధికారులతో మాట్లాడిన ఫలితం దక్కలేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ అధికారిని శ్రీకాంత్ దత్తా అడ్డగించాడు. కారును ఆపిన శ్రీకాంత్ కుక్కలాగా బౌ బౌ అంటూ తన రేషన్ కార్డు పత్రాలను చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Video, West Bengal